Organs Donations
-
అవయవదానాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది : మంత్రి హరీష్ రావు
-
ఉన్నట్టుండి కాళ్లు చచ్చుబడ్డాయి, ఆస్పత్రికి తీసుకెళ్లగా
చాదర్‌ఘాట్: అనుకోని అనారోగ్యంతో కుటుంబ సభ్యుడు బ్రెయిన్‌డెడ్‌కు గురై పుట్టెడు దుఃఖంలో ఉండికూడా ఆ పేద కుటుంబం పెద్దమనసు చాటుకుంది. అతని అవయవదానానికి ఒప్పుకోవటం ద్వారా మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించారు. మహబూబ్‌నగర్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన జాజిలి కష్ణయ్య, సత్తెమ్మ దంపతుల రెండవ కుమారుడు రాములు (24) దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గత గురువారం ఉదయం పనికి వెళ్లటానికి సిద్ధం అవుతుండగా అనుకోకుండా అతని కాళ్లు చేతులు చచ్చుబడ్డాయి. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. హుటాహుటిన అతడ్ని మలక్‌పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆలోపే అతని గొంతు కూడా మూగబోయింది. అతడికి అన్నిరకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాములుకు బ్రెయిన్‌డెడ్ అయిందని, బతికే అవకాశాలు లేవని నిర్ధారించారు. దాంతో అతని కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అవయవదానంపై ఆసుపత్రి వైద్యులు వారికి తెలియజేసి అవగాహన కలి్పంచారు. దాంతో రాములు అవయవదానానికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆసుపత్రికి వచ్చి రాములు కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అవయవదానం
చేర్యాల (సిద్దిపేట)/జనగామ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 65వ జన్మదినం సందర్భంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అవయవదానానికి ముందు కొచ్చారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలోని దుర్గామాత సాక్షిగా అవయవదానం చేస్తున్నట్లు సంతకం చేసిన పత్రాలను వైద్యులకు అందజేశారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాజ్యస భ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌లు ఇచ్చిన పిలుపు మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరణించిన తర్వాత పనిచేసే అవయవాలను ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభాగ్యులకు అందించి నూరేళ్ల ఆయుష్షును అందించాలని విజ్ఞప్తి చేశారు. అవయవదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రాన్ని అతి తక్కువ కాలంలో అభివృద్ధి పథంలో నడిపించిన సీఎం కేసీఆర్ పాత్ర దేశ రాజకీయాల్లో కీలకం కానుందన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని విధాలుగా అర్హులని పేర్కొన్నారు. కేటీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఆమె మరణం... ఐదుగురికి పునర్జననం..!
మరణించిన మనిషికి ‘పునర్జన్మ’ ఉంటుందా...? మరణానంతర ‘జీవితం’ సాధ్యమేనా..? ‘ఉంటుంది... సాధ్యమే..’నని సమాధానమిచ్చింది 14 ఏళ్ల ఓ అమ్మాయి...! తాను చనిపోయింది...!! కాద్కాదు... మరో ఐదుగురి రూపంలో ‘జీవిస్తోంది’...!!! కొత్తగూడెంరూరల్: చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామంలోని ఆ అమ్మాయి పేరు అవులూరి అభినయ. ఆమె తండ్రి అవులూరి శ్రీనివాస్. కొత్తగూడెంలో సీనియర్ జర్నలిస్ట్. ఆయన గత ఏడాది మార్చి 1న, తీవ్ర అనారోగ్యంతో మృతిచెందారు. ఆ విషాదం నుంచి ఆయన కుటుంబం ఇంకా తేరుకోనే లేదు. ఇంతలోనే, ఆయన ముద్దుల కూతురైన అభినయ(14)కు అనారోగ్యం. కొత్తగూడెంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్న ఈమెకు వారం కిందట అనారోగ్యం సోకింది. హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో కుటుంబీకులు చేర్పించారు. వారి నెత్తిపై ‘పిడుగు’ పడింది... పిడుగులాంటి వార్తను వినాల్సొచ్చింది. అభినయ ‘లేదు’... ఇక ‘లేవదు’. ఆమె ‘బ్రెయిన్ డెడ్’ అయినట్టుగా వైద్యులు బుధవారం నిర్థారించారు. ఆమె కళ్లు బాగానే ఉంటాయి... కానీ, తెరుచుకోవు. మూత్ర పిండాలు బాగానే ఉంటాయి... కానీ, ‘పని’ చేయవు. గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ, ‘పరిమితు’లుంటాయి. ఆమె శరీరంలోని ప్రధాన అవయవాలను పని చేయించే కీలకమైన మెదడు (బ్రెయిన్) మాత్రం పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది... ‘చనిపోయింది’. ఈ స్థితిలో, ఆమెలోని కొన్ని అవయవాలు (కళ్లు, గుండె, మూత్రపిండాలు, కాలేయం) కొన్ని రోజులపాటు మాత్రమే పనిచేస్తాయి. ఇదే విషయాన్ని ఆమె కుటుంబీకులకు అక్కడి వైద్యులు తెలిపారు. ‘‘ఈ స్థితిలోనే ఆమెకు ‘పునర్జన్మ’ ఇవ్వగలం. ఆమెను మరొకరి రూపంలో ‘బతికించగలం’. ఇందుకు చేయాల్సిందల్లా... ఆమె అవయవాలను దానం చేయడమే’’నని ఆ వైద్యులు సావధానంగా వివరించారు. దీనికి, అభినయ తల్లి కవిత, సోదరుడు వెంకట్ వరుణ్ అంగీకరించారు. ఆ తరువాత, అభినయ శరీరం నుంచి కళ్లు.. గుండె.. కాలేయం.. మూత్రపిండాలను వైద్యులు వేరు చేశారు. సరిగ్గా ఇవే అవయవాల వైఫల్యంతో బాధపడుతున్న, ప్రాణాపాయ స్థితికి చేరిన మరో ఐదుగురికి అమర్చేందుకుగాను వాటిని తరలించారు. ఆ ఐదుగురి రూపంలో అభినయ మళ్లీ బతికింది...! ఇకపై, ఆమె కళ్లు ఈ లోకాన్ని చూస్తాయి. ఆమె గుండె కొట్టుకుంటుంది... ఇంకొకరి శరీరంలో. ఆమె కాలేయం పనిచేస్తుంది... మరొకరి శరీరంలో. ఆమె మూత్రపిండాలు పనిచేస్తాయి... వేరొకరి శరీరంలో. మరణం... జననం... ఆమె చనిపోయింది. కానీ, కొన్ని గంటల వ్యవధిలోనే... ఆ ఐదుగురి రూపంలో ‘పునర్జన్మ’ అందుకుంది. ఆమెకు, ఆమె తల్లి కవితకు, సోదరుడు వెంకట్ వరుణ్‌కు ఆ ఐదుగురు... చేతులెత్తి నమస్కరిస్తారు...! నిరంతరం స్మరిస్తారు...!! తుది శ్వాస వరకు...!!! -
రాఖీ సావంత్ షాకింగ్ నిర్ణయం
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి రాఖీ సావంత్.. షాకింగ్ కామెంట్స్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తన వక్షోజాలను దానం చేస్తానని రాఖీ సావంత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో.. ‘కళ్లను దానం చేస్తానని బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ ప్రమాణం చేశారు. ఇలా చాలా మంది తమ శరీరంలోని అవయవాలను దానం చేస్తూ మంచి పని చేస్తున్నారు. నేను కూడా ఎదో ఒకటి డొనేట్ చేయలనుకుంటున్నాను. నా వక్షోజాలు దానం చేయాలని నిర్ణయించుకున్నాను.’ అని చివర్లో తన వక్షోజాలను ఎవరు దక్కించుకుంటారో చూద్దాం అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా స్టన్ అయ్యారు. ఇదేం నిర్ణయం అంటూ రాఖీపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. View this post on Instagram #aishwaryaraibachchan #aishwaryarai A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on Sep 21, 2018 at 12:42pm PDT ఈ విషయంపై మీడియా ఆరాతీయగా.. ‘మీకు తెలియదు చాలా మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ సమయంలో వారి వక్షోజాలు తీసేస్తారు. అందుకే నేను నా వక్షోజాలు దానం చేయాలనుకున్నాను. ఈ విషయం ఇంత గందగోళం సృష్టిస్తుందని నేను ఊహించలేదు’ అని రాఖీ తన చర్యలను సమర్ధించుకున్నారు. -
అంగట్లో అవయవాలు
మానవుల్లో ‘అవయవాల దానం’ అనే మహోత్కృష్ట సేవానిరతిని నీరుగార్చేశారు. ఉదాత్తమైన హృదయంతో ఉచితంగా అందజేసే అవయాలను అంగడి సరుకుగా మార్చేశారు. అందులోనూ స్వదేశీయులకు మొండిచేయి చూపుతూ విదేశీయుల ముందు చేయిచాపుతూ లక్షలు ఆర్జిస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ పుణ్యమా అని అవయవాల అమ్మకాల దారుణం బట్టబయలైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలతో బయటపడే అవకాశం లేని వ్యక్తులు, బ్రెయిన్ డెడ్‌కు గురయ్యేవారు అవయవాలు దానం చేయడం సహజం. బాధితుల బంధువుల సమ్మతితో అవయవాలను స్వీకరించి మరో రోగికి అమర్చాలనే నిబంధన ఉంది. అయితే 90 శాతానికి పైగా కేసుల్లో బంధువులకు తెలియకుండా అవయవాలను తస్కరిస్తున్నారు. దాదాపు మరణశయ్యపై ఉన్న రోగిని ఎంచుకుని అతడు కోలుకోవడానికి శస్త్రచికిత్స అవసరమని చెప్పి ఒప్పించి అవయవాలు కాజేస్తున్నారు. తస్కరించిన అవయవాలను లక్షలాది రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన రోగుల అవయవాలను తమిళనాడులోని వివిధ ఆస్పత్రుల్లో అవయవాల కోసం కాచుకుని ఉండే విదేశీయులకు పెద్ద మొత్తంలో అమ్మివేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమిళనాడులోని కార్పొరేట్ ఆస్పత్రుల సహకారంతో ఈ ఘోరాలు సాగిపోతున్నాయి. అవయవాల కేటాయింపునకు సంబంధించి కేంద్రం రూపొందించిన నియమ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా అక్రమాలు సాగిపోతున్నాయి. తమిళనాడులో అందుబాటులోకి వచ్చిన అవయవాలను ముందుగా తమిళనాడుకు చెందిన రోగికి అమర్చాల్సి ఉంటుంది. అలాంటి రోగి లేనిపక్షంలోనే ఇతరులను పరిగణనలోకి తీసుకోవాలి. అయితే అవయవదానంలోని చట్టాలను ధిక్కరించి.. ఎక్కువసొమ్ము ముట్టజెప్పే విదేశీయులకు అమరుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేరళ వ్యకి అవయవాలు ఉక్రెయిన్ వ్యక్తికి ఈ ఏడాది మే 18వ తేదీన సేలంలో జరిగిన ఒక ప్రమాదంలో కేరళకు చెందిన కుటుంబం తీవ్రంగా గాయపడింది. ఈ కుటుంబంలోని మణికంఠన్ అనే వ్యక్తి బ్రెయిన్‌డెడ్‌కు గురికాగా అతడి అవయవాలను తమిళనాడుకు చెందిన వారికి అమర్చలేదు. ఊపిరితిత్తులను ఇజ్రాయిల్‌కు చెందిన రోగికి, ఇతర అవయవాలను ఉక్రెయిన్ దేశానికి చెందిన వ్యక్తికి అమర్చారు. ఈ దుర్మార్గంపై విచారణ జరపాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామికి ఉత్తరం ద్వారా కోరారు. ఎడపాడి వెంటనే విచారణకు ఆదేశించగా విచారణ కమిటీ బృందం సోమవారం నివేదికను సమర్పించింది. మంత్రి భార్యకు కూడా అమర్చకుండా.. నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. అవయవాల దాత కోసం ఎదురుచూసే వారు తమ పేర్లను అందుకు సంబంధించిన జాబితాలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జాబితాలోని వరుస ప్రాధాన్యత ప్రకారం మాత్రమే అవయాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ఇద్దరు వ్యక్తులు తమ వరుసవారీ నంబరును తారుమారు చేసి అవయవాలను పొందినట్లు తేలింది. మరో కార్పొరేట్ ఆస్పత్రి వారు భారతీయునికి అమర్చాల్సిన అవయవాన్ని విదేశీయుని అమ్మివేసి అమర్చారు. ఈ శస్త్రచికిత్స మే 21వ తేదీన జరిగింది. సేలంలో ప్రమాదానికి గురైన కేరళ వ్యక్తి మణికంఠన్ అవయవాలను దానం చేయడానికి కుటుంబసభ్యులను బలవంతంగా ఒప్పించారు. మణికంఠన్ కిడ్నీని అమర్చాల్సిన వ్యక్తికి బదులుగా ఉక్రెయిన్‌కు చెందిన రోగికి అమర్చారు. అలాగే మణికంఠన్ గుండెను ఉక్రెయిన్ దేశానికి చెందిన వ్యక్తికి అమర్చాలని నిర్ణయించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా లెబనాన్ దేశానికి చెందిన రోగికి అమర్చారు. అయితే మణికంఠన్ గుండె లెబనాన్ వ్యక్తికి సెట్ కాకపోవడంతో కొన్ని గంటల్లోనే మృతిచెందాడు. మణికంఠన్ అవయవాలు ఎవరెవరికి అమర్చారో అనే వివరాలను సైతం నమోదు చేయలేదు. మూత్రపిండాల మార్పిడికి ఎంతోకాలంగా వేచి ఉన్న తమిళనాడు మంత్రి భార్యకు సైతం లేని ప్రాధాన్యత నివ్వకుండా విదేశీయునికి అమ్ముకున్నట్లు తేలింది. అంతా దళారీల ద్వారానే.. అవయవదానాలకు చెందిన అన్ని అక్రమాలు కార్పొరేట్ ఆస్పత్రులోని అవయవ మార్పిడి విభాగం, దళారీల నడుమ సెల్ఫోన్ల ద్వారానే రహస్యంగా సాగిపోతోంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో ఇలాంటి అక్రమాలు ఎక్కువగా సాగుతున్నట్లు విచారణ బృందం కనుగొంది. అంగీకారం లేకుండా మనుషుల అవయవాల తొలగింపు చట్టం సెక్షన్ 18, ఐపీసీ 420 సెక్షన్ కింద చీటింగ్, 465 సెక్షన్ కింద అక్రమాలు, 120 సెక్షన్ కింద మూకుమ్మడి కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు విచారణ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అక్రమంగా అవయవాల మార్పిడిలో సుమారు రూ.12 కోట్ల అవినీతి చోటుచేసుకున్నట్లు రాష్ట్ర స్థాయి విచారణలో స్పష్టమైనందున సీబీఐ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు, ధర్మపురి పార్లమెంటు సభ్యులు డాక్టర్ అన్బుమణి రాందాస్ డిమాండ్ చేశారు. -
కిడ్నీల మార్పిడిలో భార్యల గొప్ప మనసు
సాక్షి బెంగళూరు: సాధారణంగా బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలను రోగులకు అమర్చుతారు. ఇక్కడ మాత్రం ఇద్దరు రోగుల భార్యల మూత్రపిండాలను మార్చి అమర్చారు. వివరాలు... బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో సంతోష్, మరో ఆస్పత్రిలో క్రిష్ణ అనే మూత్రపిండాల రోగులు చికిత్స పొందుతున్నారు. వీరికి మూత్రపిండాల మార్పిడి చేయడమే పరిష్కారమని వైద్యులు తేల్చారు. కిడ్నీలను దానం చేసేందుకు వారి భార్యలు ముందుకొచ్చినప్పటికీ జత కాలేదు. అయితే సంతోష్‌కు క్రిష్ణ భార్య మూత్రపిండం, క్రిష్ణకు సంతోష్ భార్య మూత్రపిండం సరిపోతాయని వైద్యుల పరీక్షల్లో తేలింది. దీంతో నలుగురికీ అవగాహన కల్పించి అవయవ మార్పిడికి సిద్ధం చేశారు. ఇరువురు మహిళల నుంచి కిడ్నీలను సేకరించి సంతోష్, క్రిష్ణలకు అమర్చారు. ఇలా ఇచ్చిపుచ్చుకునే స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇదే తొలిసారి అని వైద్యులు చెబుతున్నారు. గ్రీన్ కారిడార్‌ను ఏర్పరచి రెండు ఆస్పత్రుల నుంచి 15–20 నిమిషాల్లో మూత్రపిండాలను తరలించారు. రోగులకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. -
నాన్న కోసం.. 25 రోజుల్లో 15 కేజీలు..
కన్నవారిని ఆస్తులు గుంజుకుని నడిబజార్లో నిలబెడుతున్న రోజులివి. అనుబంధాలకు ఆప్యాయతలకు అర్థం తెలియని మనుషులున్న లోకంలో ఇంకా కొందరు కన్నవారి సంతోషం కోసం తపిస్తున్నారు. నాన్న కష్టంలో ఉంటే ఆ తనయుడు తట్టుకోలేకపోయాడు. తన ప్రాణానికి ముప్పు ఉన్నప్పటికీ కాలేయంలో కొంతభాగాన్నిదానమివ్వడానికి సిద్ధమయ్యాడు. బొమ్మనహళ్లి: తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి తప్పించేవాడే తనయుడు అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. ఆ మాటను మైసూరు నగరానికి చెందిన ఓ యువకుడు నిజం చేస్తున్నాడు. కాలేయ వ్యాధితో మృత్యువు అంచున ఉన్న తండ్రిని రక్షించడానికి తన కాలేయ దానానికి సిద్ధమమయ్యారు, అంతేకాదు ఆ శస్త్రచికిత్స చేయించుకోవడానికి అనువుగా కేవలం 25 రోజుల్లో సహజ సిద్ధంగా 15 కేజీల బరువు తగ్గాడు. లివర్ సిర్రోసిస్ సోకడంతో.. : మైసూరు వీరేనగర్కు చెందిన అశోక్‌జైన్ జ్యువెల్లర్స్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట కాలేయ వ్యాధి బారిన పడడంతో అశోక్‌జైన్ ఆరోగ్యం క్షీణించసాగింది. కూర్చున్న చోటే నిద్రపోవడం, మతిమరుపు, ఆయాసం తదితర ఇతర జబ్బులు కూడా చుట్టుముట్టాయి. స్థానిక ఆస్పత్రిలో చేర్పించగా, వ్యాధి అప్పటికే ముదిరిపోవడంతో చెన్నైలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అశోక్‌కు లివర్ సిరోసిస్ అనే వ్యాధి సోకిందని, అది అంత్య దశకు చేరిందని, ఆగస్ట్ నెలలోపు శస్త్రచికిత్స చేయాలని తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు కాలేయాన్ని కొంతభాగాన్ని దానం చేయాలని, ఇందుకు లైవ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనే ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అశోక్‌జైన్ కుమారుడు ప్రీతేశ్జైన్ కాలేయ దానానికి సిద్ధమయ్యాడు. పరిశ్రమించి బరువు తగ్గాడు : ఇందులో ప్రీతేశ్కు శస్త్రచికిత్స చేసి ఆయన కాలేయంలోని కొంతభాగాన్ని సేకరించి తండ్రి కాలేయానికి అమరుస్తారు. అయితే స్థూలకాయం ఉండడం వల్ల రెండు నెలల్లో పట్టుదలగా సైక్లింగ్, వాకింగ్, మితాహారం పాటిస్తూ 15 కేజీల బరువుతగ్గాడు. బైక్, కారు ఎక్కకుండా ఎక్కడికైనా కాలినడనకనే వెళ్తుంటాడు. ఈ నెలాఖరులో శస్త్రచికిత్స జరిగే సమయానికి మరింత బరువు తగ్గడానికి యత్నిస్తున్నాడు. తన తండ్రిని కాపాడుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. -
ఇతరుల కుటుంబాల్లో వెలుగు నింపాలని..
గుంటూరు ఈస్ట్: తాను మరణించినా ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు ఓ యువకుడు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేసి ఆ తల్లిదండ్రులు ఐదు కుటుంబాల్లో వెలుగులు నింపారు. శావల్యాపురం మండలం పోట్లూరుకు చెందిన నారాయణరెడ్డి, భద్రమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. చిన్న కుమారుడు గోపవరపు హనుమంతరావు (37) విఘ్నేశ్వర డెయిరీలో పనిచేస్తున్నాడు. మార్చి 26న అతడు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రులు 29న జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అయితే తమ కుమారుడు దక్కడని వైద్యులు స్పష్టం చేయడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తమ కుమారుడి అవయవాలను దానం చేయడం ద్వారా ఇతర కుటుంబాల్లోనైనా వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని వైద్యులు తెలిపి తమ కుమారుడి అవయవాలను ఆదివారం దానం చేశారు. కన్న బిడ్డ దూరమైనా.. మరో ఐదుగురిలో జీవించి ఉన్నాడనే సంతృప్తి తమకు చాలని ఆ తల్లిదండ్రులు తెలిపారు. గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతం సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మరో గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. రెండేళ్లుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న విజయవాడ కృష్ణలంకకు చెందిన గుంటూరు సురేష్ (24)కు జీజీహెచ్‌లో ఆదివారం గుండె మార్పిడి ఆపరేషన్ చేసి పునర్జన్మను ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే విలేకరులకు వివరాలు వెల్లడించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న గుంటూరు సురేష్ (24)కు గుండె మార్పిడి ఆపరేషన్ మినహా మరో మార్గం లేదని గుర్తించామని చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో బ్రెయిన్ డెడ్ కేసు ఉందని డాక్టర్ రాజునాయుడు చెప్పడంతో డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో తమ బృందం అత్యవసరంగా చికిత్స చేసి గుండె మార్పిడి ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. జీవన్‌దాన్ ట్రస్టు ద్వారా గుండెను సేకరించినట్లు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మొట్ట మొదటిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్ ఇక్కడ జరగడం ఆనందంగా ఉందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రమే అవయవాలు సేకరించే తరుణంలో గుంటూరు జీజీహెచ్‌లోనే అవయవాలు సేకరించి ఇక్కడే అమర్చడం మరో అరుదైన సంఘటన అని చెప్పారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు మాట్లాడుతూ జీజీహెచ్‌కి ఇదొక మైలురాయి అన్నారు. అనంతరం డాక్టర్ గోఖలే, డాక్టర్ సుధాకర్‌ను సన్మానించారు. వైద్యులు మోతీలాల్, భరద్వాజ్, శరశ్చంద్ర, సహృదయ ట్రస్టు సభ్యులు, డాక్టర్ గోఖలే బృందం పాల్గొంది. -
1300 కిలోమీటర్లు.. ఓ గుండె ప్రయాణించిన దూరం!
ముంబై నుంచి చెన్నైకి.. 1300 కిలోమీటర్లు ప్రయాణించి.. ఓ గుండె మరో మనిషికి ప్రాణం పోసింది. అవయవ దానంపై స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన పెంచుతుండడంతో దాని ఆవశ్యకతను ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. తాజాగా ముంబయిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను ఏకంగా 1300 కిలోమీటర్ల దూరంలోని ఓ వ్యక్తికి అమర్చి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఇందుకు ఎయిర్పోర్ట్ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది, వైద్యులు ఎంతో సహకారం అందించారు. నవీ ముంబైకి చెందిన చేతన్ టేలర్ ఓ చిరు వ్యాపారి. అతను తీవ్ర అస్వస్థతతో 20 రోజుల క్రితం అపోలో ఆస్పత్రిలో చేరాడు. అతని మెదడులో రక్తస్రావం అవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దాన్ని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు అతని కుటుంబసభ్యులకు తెలిపారు. అలాగే అవయవదానం గురించి చేతన్ భార్య, కుమారుడికి అవగాహన కల్పించడంతో వారు చేతన్ గుండెను దానం చేసేందుకు ముందుకొచ్చారు. చేతన్ కుటుంబసభ్యులు గుండె దానానికి ఒప్పుకోవడంతో నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగింది. చెన్నైలోని నివసిస్తున్న లెబనాన్‌కు చెందిన 61 ఏళ్ల వ్యాపారవేత్తకు ఆ గుండె సరిపోతుందని తెలియడంతో చేతన్ హృదయాన్ని నవీ ముంబై నుంచి చెన్నైకి తరలించారు. గుండెను తరలించే క్రమంలో అధికారులు ఎక్కడిక్కడ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో ఆస్పత్రి నుంచి కేవలం 40 నిమిషాల్లో గుండెను ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేర్చారు. చార్టెడ్ విమానంలో అక్కడి నుంచి 4 గంటల్లో చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకొచ్చి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు. -
‘కమల’ వికాసం!
అవయవ దానంతో ఐదుగురికి కొత్త జీవితం కుటుంబ సభ్యుల ఔదార్యం సాక్షి, విశాఖపట్నం: ఒక మహిళ తాను తనువు చాలించి మరో ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఆమె కుటుంబ సభ్యుల ఔదార్యంతో ఇది సాధ్యమైంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కుదుము గ్రామానికి చెందిన వలురౌతు రాజులమ్మ అలియాస్ కమల (50) కు పదేళ్ల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అప్పట్నుంచి మందులు వాడుతూ ఆరోగ్యంగానే ఉన్న ఆమె ఇటీవల అస్వస్థతకు గురయింది. ఈ నెల 19న కుటుంబ సభ్యులు ఆమెను విశాఖలోని క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె సెలెబ్రెల్ బ్లీడ్తో బాధపడుతున్నట్టు గుర్తించి శస్త్ర చికిత్స చేశారు. అయినప్పటికీ ఆమె బ్రెయిన్‌డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆమె భర్త, కుటుంబ సభ్యులకు వైద్యులు తెలియజేశారు. కమల బతికే అవకాశం లేదని, అవయవదానంతో ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని జీవన్‌దాన్ ప్రతినిధులు వారికి సూచించారు. ఇప్పటికే సామాజిక సేవలో ఉన్న కమల భర్త షణ్ముఖరావు, ఇంజినీరింగ్ పట్టభద్రులైన ముగ్గురు కుమార్తెలు తుషార, గీత, జ్యోత్స్నలు సహదయంతో కమల అవయవాల దానానికి అంగీకరించారు. దీంతో వైద్యులు ఆదివారం సాయంత్రం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కమల కాలేయాన్ని విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి, కిడ్నీలను విశాఖలోని సెవెన్‌హిల్స్, అపోలో ఆస్పత్రులకు, కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. కమల కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని ఎన్ఆర్ఐ ఆస్పత్రి చైర్పర్సన్ చలసాని విజయలక్ష్మితో పాటు పలువురు అభినందించారు. క్వీన్స్ ఎన్ఆర్ఐ నెఫ్రాలజిస్టు సాయినరేష్, యూరాలజిస్టు జయసాయిశేఖర్, నాగరాజ్, మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఈ అవయవదాన ప్రక్రియను పూర్తి చేశారు.