
జిన్నారం(నర్సాపూర్): అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అరుణ గ్రహంపైకి వచ్చే సంవత్సరం జూలైలో పంపనున్న మార్స్ రోవర్‌లో అమర్చే మైక్రోచిప్‌లో సంగారెడ్డి జిల్లా బొల్లారం ఉన్నత పాఠశాల విద్యార్థుల పేర్లు చేర్చినట్లు పాఠశాల ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మైక్రోచిప్‌లో పొందుపరిచిన కోటి పేర్లలో తమ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థుల పేర్లు ఉండడం విశేషమన్నారు. ఈ వ్యోమనౌక 2021 ఫిబ్రవరిలో అరుణ గ్రహాన్ని చేరుతుందని చెప్పారు. పేర్లు పంపడానికి ఉత్సాహం చూపించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment