ఖమ్మం మయూరిసెంటర్: పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనం కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాభాస్కర్ విమర్శించారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసమే ప్రధాని తహతహలాడుతున్నారన్నారు. తెలంగాణ మావల్లే అభివృద్ధి చెందుతుందన్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామన్న టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక మాటమార్చిందన్నారు.
యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సాయిబాబా అధ్యక్షతన ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మహాసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, ఔట్‌సోర్పింగ్ ఉద్యోగులను చేయమనడం కేసీఆర్‌కు తగదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు వేసిన కమిటీ ఎప్పటికి నివేదిక ఇస్తుందో తెలియదన్నారు. అంగన్‌వాడీలు ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తూనే ఉన్నా స్పందించడం లేదన్నారు. ఏ రంగంలో పనిచేసే వారికైనా రూ.15వేల కనీస వేతనం ఉండాలని కార్మికవర్గం పోరాటం చేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షన్నర మంది మధ్యాహ్న భోజన వర్కర్లు ఉన్నారన్నారు.
తెలంగాణలో 70 వేల మంది వరకు పనిచేస్తున్నారని తెలిపారు. వీర్ని తొలగించాలనే యో చనలో ప్రభుత్వం ఉందన్నారు. పొరుగు రా ష్ట్రాల్లో ఓ జాబ్‌కార్డు ఉంది..మనరాష్ట్రంలో ఉ ద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదన్నారు. వరంగల్‌లో ఇనుపఖనిజాలు ఉన్నాయని 1953 నుంచి చెబుతున్నా ఇప్పటి వరకు వా టిని వెలికి తీసిన దాఖలాలు లేవన్నారు. ఆ దిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పత్తి బాగా పండుతుందని తెలిసినా ఏ ప్రభుత్వ మూ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీని నెలకొల్పదన్నారు.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని సీఐటీయూ జాతీయ కార్యదర్శి హేమలత అన్నారు. ధ రలు తగ్గిస్తారని, ఉద్యోగ అవకాశాలు మె రుగుపడుతాయని, లంచగొండి తనాన్ని రూపుమాపుతారని ఆశాపడ్డారని తెలిపా రు. ప్రభుత్వాలు ఏర్పడి వందరోజులైనా ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఏవీ లేవన్నారు.
ఎన్నికలకుముందు ఏమి చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను కోరుతున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సాయిబాబా పేర్కొన్నారు. అసంఘిత రంగంలో ఉన్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
ముఖ్యమంత్రి మాటలు, పనితీరుపై సందేహాలను ఆయనే నివృత్తి చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య కోరారు. ఇటీవల జరిపిన సమగ్ర కుటుంబ సర్వేపై పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వేస్తున్న అడుగులు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో దళితులకు మూడు ఎకరాల భూమి అంటూ ఆగస్టు 15న పట్టాలు ఇచ్చారు కానీ నేటికీ భూమి అప్పగించలేదన్నారు. సింగరేణిని అద్భుత సంస్థగా అభివృద్ధి చేస్తామని, సింగరేణికి చెందిన కేంద్ర వాటాలు కొనుగోలు చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారన్నారు. ఆర్టీసీ, విద్యుత్ రంగాల్లో వస్తున్న పరిణామాలు సింగరేణి గురించి ఆందోళన పడేలా చేస్తున్నాయన్నారు.
జిల్లాలోని 5,500 మంది ఆశావర్కర్లకు 18 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సభ దృష్టికి తీసుకొచ్చారు. జూన్ 5న భద్రాచలం వచ్చిన ఉప ముఖ్యమంత్రి రాజయ్య దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా వెంటనే ఇస్తామని వాగ్దానం చేసి నేటికీ దాన్ని నెరవేర్చలేదన్నారు.
యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు వందన సమర్పణతో సభ ముగిసింది. ఈ సభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజారావు, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, జిల్లా అధ్యక్షుడు ఎ.జె.రమేష్, ఆహ్వానసంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యర్రా శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చుక్కా రామయ్య, ఎస్.ఎన్.రెడ్డి, భిక్షమయ్య, రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, వెంకటేష్, వీరారెడ్డి, ఎస్.రమ, చుక్కయ్య, వంగూరి రాములు, ఎండి.అబ్బాస్, టి.విష్ణువర్దన్, అఫ్రోజ్‌సమీన, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు గ్రెయిన మార్కెట్ నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ఎర్రజెండాలు చేబూని ప్రదర్శనగా తరలివచ్చారు.
పెట్టుబడిదారుల ముద్దుబిడ్డ మోడీ
Published Sat, Sep 6 2014 1:50 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM
Advertisement
Advertisement