హైదరాబాద్: నాసా ఆహ్వానం అందుకున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పర్యటనకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. కెనడాలో ఈనెల 20 నుంచి 24 వరకు జరిగే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్(ఐఎస్‌డీసీ) జరుగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న తెలంగాణకు చెందిన 16 మందితో పాటు పశ్చిమ గోదావరికి చెందిన మరో విద్యార్థిని అర్హత సాధించారు. వీరందరూ నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు కావటంతో సదస్సుకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత అడ్డంకిగా మారింది. దీంతో స్పందించిన సీఎం విద్యార్థులకయ్యే పూర్తి ఖర్చును అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం హామీ మేరకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున 17 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లాకు చెందిన అంకితి పావని, స్టెల్లా కుమారి, దివ్యరాణి, మేఘన, నాగ సంతోష్, శ్రీనిజ, హైదరాబాద్‌కు చెందిన ఎం.శ్రీనివాసరావు, చెన్నరాయుడు, ప్రభాదీనరాజు, నవ్య, షేక్ మనీషాబాబు, డి.పల్లవి, డి.వినయ్‌కుమార్, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జమీమిహా ఎవాంజలైన్, షాద్ నగర్‌కు చెందిన బాస రచన, కొత్తాపూర్‌కు చెందిన షేక్ గుల్జా ఈ సదస్సులో పాల్గొనేందుకు ఎంపికయ్యారు.
క్రికెట్ క్రీడాకారుడికి చేయూత
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం విద్యానగర్ కాలనీకి చెందిన మహ్మద్ రియాజుద్దీన్ ఖాజాకు ప్రభుత్వం రూ. 2 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసింది. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగే ఫిజికల్లీ చాలెంజ్‌డ్ క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు అయ్యే ఖర్చులకు సాయం కోరుతూ రియాజుద్దీన్ ఇటీవలే సీఎంకు విజ్ఞప్తి చేసుకున్నారు.
నాసాకు వెళ్లేందుకు భరోసా
Published Sat, May 16 2015 1:46 AM | Last Updated on Wed, Jul 25 2018 2:52 PM
Advertisement
Advertisement