లోతట్టు ప్రాంతానికి తరలుతున్న జలసంపద
జిల్లాలో 2,195 చిన్న నీటిపారుదల ప్రాజెక్టులున్నాయి. ఇందులో వంద ఎకరాలలోపు ప్రాజెక్టులు 1,912 కాగా, 283 ప్రాజెక్టులు వంద ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. వీటి పరిధిలో 1.28లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో పలు చెరువులు అన్యాక్రాంతం కాగా.. మరికొన్ని ప్రాజెక్టుల్లో నీరు చేరడమే కష్టంగా మారింది.
ఈ క్రమంలో సాగుకు నీరందే అవకాశం లేనప్పటికీ.. భూగర్భ జలాల పెంపులో కొంత మార్పునకు అవకాశముంది. వ్యవసాయానికి నీరందించే వాటిలో ప్రధానంగా నాలుగు ప్రాజెక్టులున్నాయి. ఇందులో కోట్‌పల్లి ప్రాజెక్టు పరిధిలో ఆరువేల ఎకరాలు సాగవుతుండగా, కాగ్నా, కాక్రవేణి, మల్కందాని ప్రాజెక్టుల పరిధిలో ఐదు వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఈ నాలుగు ప్రాజెక్టులను ఆధునికీకరిస్తే గరిష్టంగా 20 వేల హెక్టార్లకు సాగు నీరందించే అవకాశముందని భావించిన ప్రభుత్వం.. పనులకు అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు రూ.44.42 కోట్లు కేటాయించింది.
ఎక్కడిపనులు అక్కడే..
నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం వివిధ దశల్లో పనులకు అనుమతులిస్తూ నిధులు కేటాయించింది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టు పనులు కూడా పూర్తికాలేదు. కాక్రవేణి ప్రాజెక్టు పనులను ప్రారంభించి నిధులు ఖర్చు చేసినప్పటికీ పనులు అర్ధంత రంగా నిలిచిపోయాయి. మరోవైపు జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రాణాహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఇప్పటివరకు అతీగతీ లేదు. దీంతో సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు ఇప్పటికీ నిరాశే మిగిలింది. కొత్త ప్రభుత్వమైనా దీనిపై స్పందించాల్సి ఉంది.
నీళ్లొదిలారు!
Published Tue, Sep 16 2014 11:49 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement