heavily funded
-
పురపాలకశాఖకు..రూ.15,594 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పురపాలక శాఖకు భారీగా నిధులు దక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.15,594 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్లో కేటాయించింది రూ.11,372 కోట్లే. కాగా ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్‌లో చేపట్టే అభివృద్ధి పనులకే అత్యధికంగా రూ. 10వేల కోట్లు ప్రకటించడం గమనార్హం. రానున్న మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ గ్రేటర్ హైదరాబాద్‌కు భారీగా నిధులు కేటాయించారన్న వాదన ఉంది.హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం స్పెషల్ ఫోకస్ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలను కలిపి జీహెచ్ ఎంసీ పరిధిలోకి తేవాలని సీఎం ఆలోచన. ఈ పరిధిలోనే రాబోయే పదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ప్రతిపాదించారు.ఇందులో మూసీ రివర్ ఫ్రంట్, నాలాల అభివృద్ధి, మెరుగైన నీటిసరఫరా, మెట్రో విస్త రణ, ఓఆర్ఆర్కు ఇరువైపులా అభివృద్ధి, హైడ్రా ప్రాజె క్టుతో పాటు రీజినల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్) వంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపో యినా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా ఈ అభివృద్ధి పనులు కొనసాగించాలని నిర్ణయించినట్టు రెండురోజుల క్రితం తన నివాసంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.ఇందులో భాగంగానే ఈ 2024–25 బడ్జెట్లో కేవలం హైదరాబాద్ అభివృద్ధికే రూ. 10వేల కోట్లు కేటాయించారు. వచ్చే జనవరినాటికి హైదరాబాద్ శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. ఏడాదిన్న రలో జీహెచ్ఎంసీ పదవీకాలం కూడా ముగియనున్న నేప థ్యంలో ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని పాలకమండళ్ల పరిధి నిర్వహణకు ఎలాంటి ప్రణాళికలు చేయాలనే అంశంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓఆర్ఆర్ లోపల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఈ ఏడాదిలో వెచ్చించనున్నట్టు స్పష్టమవుతోంది.ఇతర జిల్లాల్లోని పురపాలికలకు...హైదరాబాద్, రంగారెడ్డి పాత ఉమ్మడి జిల్లాలు మినహా మిగతా 8 ఉమ్మడి జిల్లాల్లోని పురపాలక సంస్థల్లో రూ. 5,594 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోప్రధానమైన 100 మునిసిపాలి టీలతో పాటు పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లు కేటాయించారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2022–23లో ఈ శాఖకు రూ.2,213 కోట్లు కేటాయించగా.. 2023–24లో రూ.3,001 కోట్లు కేటాయించారు. ఈ సారి గత సంవత్సరం కన్నా రూ.835 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం.రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.723 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 39.33 లక్షల కుటుంబాలకు ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ.500 చొప్పున సబ్సిడీగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లకు రూ.500 చొప్పున సబ్సిడీ ఇస్తే రూ.590 కోట్లు ఖర్చవుతాయి. అదే 4 సిలిండర్లు ఇస్తే రూ.786 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.అటవీశాఖకు రూ.1,063 కోట్లుహైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు సంబంధించి రూ.1,063.87 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో అటవీ, పర్యావరణ శాఖలోని వివిధ అంశాలకు చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. పీసీసీఎఫ్, హెచ్‌వోడీకి శాఖాపరంగా పలు విధుల నిర్వహణకు సంబంధించి రూ.876 కోట్లు (రూ.162.13 కోట్లు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కలిపి) ప్రతిపాదించారు. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు రూ.102.99 కోట్లు, జూపార్కులకు రూ.12 కోట్లు, అఫారెస్టేషన్ ఫండ్ రూ.5 కోట్లు, ప్రాజెక్ట్ టైగర్‌కు రూ.5.21 కోట్లు ప్రతిపాదించారు.ఇంధన శాఖకు రూ.16,410 కోట్లుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంధన శాఖకు బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో శాఖకు రూ.12,727 కోట్లను కేటా యించగా, 2024–25 బడ్జెట్లో రూ.16,410 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం పెంచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర కేటగిరీలకు రాయితీపై విద్యుత్ సరఫరాకు గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ రూ.8,260 కోట్లను కేటాయించింది.ఉదయ్ పథకం కింద రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల రుణాలను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవడానికి గతేడాది రూ.500 కోట్లను కేటాయించగా, ఈసారి రూ.250 కోట్లకు తగ్గించింది. ప్రతి నెలా పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు అమల్లోకి తెచ్చిన గృహ జ్యోతి పథకానికి మరో రూ.2418 కోట్లను కేటాయించింది. ట్రాన్స్‌కో, డిస్కంలకు ఆర్థిక సహాయం కింద రూ.1509.40 కోట్లను కేటాయించింది. గత ఐదు నెలల్లో గృహ జ్యోతి పథకం అమలుకు రూ.640 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే డిస్కంలకు చెల్లించింది. ఈ పథకం కింద 46,19,236 కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తోంది. -
చెరువులకు మహర్దశ
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలో చెరువులకు పూర్వవైభవం రానుంది. వాటి మరమ్మతులకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకనుగుణంగా మిషన్ కాకతీయ ద్వారా మొదటి విడతలో 1266 చెరువులు ఎంపికయ్యాయి. దీంతో పూడికతో నిండిపోయిన చెరువులు, కుంటల్లో యుద్ధప్రాతిపదికన ఒండ్రుమట్టిని తీయడంతో పాటు వాటికి వచ్చే వరద కాలువలను బాగుపరిచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో చెరువు స్థాయినిబట్టి రూ.10లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఖరీప్ నాటికి వీటిని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అందుకోసం జనవరి 27నుంచి టెండర్లు నిర్వహించేం దుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఎంపికైన చెరువుల చిట్టాను జిల్లా చిన్ననీటిపారుదల అధికారులు గురువారం ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు... జిల్లాలో మొత్తం 6,500 చెరువులున్నాయి. వాటిలో పెద్ద చెరువులు (వంద ఎకరాల విస్తీర్ణంలో విస్తరించినవి) 681. వీటికింద 1,56,334 ఎకరాలు సాగవుతోంది. ఇక చిన్న చెరువులు 5,819 ఉన్నాయి. వీటికింద 82,722 ఎకరాలు సాగవుతోంది. అయితే ఈ చెరువులను 30 ఏళ్లుగా పట్టించుకునే నాధుడు లేకపోవడంతో ఒండ్రుమట్టితో పూడిపోయాయి. వీటికి వరద వచ్చే కాల్వలు కూడా మట్టితో నిండి చెరువుల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోయింది. ఈ నేపథ్యంలో మెజార్టీ చెరువులలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండటం లేదు. దీంతో వాటికింద సాగవ్వాల్సిన ఆయకట్టు అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం చెరువులన్నింటిలోనూ యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించింది. తద్వారా మొదటి విడతలో భాగంగా 20శాతం చెరువులను బాగుపరచాలనుకొంది. అందుకోసం ఆయా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలోని చెరువులను మొదటి ప్రాధాన్యతగా వేటిని చేపట్టాలో సూచించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలందరూ వారి ప్రాధాన్యతను అధికారులకు అందజేశారు. ఇలా మొత్తం మీద ఎమ్మెల్యేల నుంచి 1569 చెరువులకు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వీటిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 20శాతం మించకుండా ఉండేం దుకు అధికారులు స్క్రూటినీ చేశారు. ఇలా మొత్తం మీద 1266 చెరువులకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. చెరువులన్నీ ఖాళీయే.. ఈ ఏడాది కురిసిన వర్షాలు అంతంత మాత్రంగా ఉండడం, పడినచోట్ల వరద కాలువలు సరిగా లేని కారణంగా జిల్లాలోని చెరువులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలో కాస్త మెరుగ్గా వర్షాలు కురవడంతో పరిస్థితి కాస్త ఫర్వాలేదనిపిస్తోంది. ఈ డివిజన్ పరిధిలో 318 పెద్దవి, 2646 చిన్న చెరువులున్నాయి. వీటిలో చిన్నా, పెద్దా కలిపి మొత్తం 334 నిండాయి. చెరువుల నిర్వాహణ సరిగా లేకపోవడంతో 46 చెరువులకు గండ్లు పడ్డాయి. ఇక వనపర్తి డివిజన్ పరిధిలో 152 పెద్దవి, 1,069 చిన్న చెరువులున్నాయి. వీటిలో కేవలం 32 చెరువులు మాత్రమే నిండాయి. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో 223 పెద్దవి, 2,104 చిన్న చెరువులున్నాయి. వీటిలో ఏ ఒక్క చెరువు పూర్తిస్థాయిలో నిండకపోగా... ఐదు చెరువులకు గండ్లుపడి ఉన్న నీరంతా వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితి వచ్చే ఏడాది నుంచి చెక్‌పడనుంది. గతంలో మాదిరిగా చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండనుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల వివరాలు డివిజన్ చెరువులు మిషన్ కాకతీయకు ఎమ్మెల్యేలు ఎంపిక ప్రతిపాదించినవి మహబూబ్‌నగర్ 1,872 375 413 వనపర్తి 1,480 295 280 నాగర్‌కర్నూల్ 1,670 336 576 నారాయణపేట 1,301 260 300 -
నీళ్లొదిలారు!
లోతట్టు ప్రాంతానికి తరలుతున్న జలసంపద జిల్లాలో 2,195 చిన్న నీటిపారుదల ప్రాజెక్టులున్నాయి. ఇందులో వంద ఎకరాలలోపు ప్రాజెక్టులు 1,912 కాగా, 283 ప్రాజెక్టులు వంద ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. వీటి పరిధిలో 1.28లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో పలు చెరువులు అన్యాక్రాంతం కాగా.. మరికొన్ని ప్రాజెక్టుల్లో నీరు చేరడమే కష్టంగా మారింది. ఈ క్రమంలో సాగుకు నీరందే అవకాశం లేనప్పటికీ.. భూగర్భ జలాల పెంపులో కొంత మార్పునకు అవకాశముంది. వ్యవసాయానికి నీరందించే వాటిలో ప్రధానంగా నాలుగు ప్రాజెక్టులున్నాయి. ఇందులో కోట్‌పల్లి ప్రాజెక్టు పరిధిలో ఆరువేల ఎకరాలు సాగవుతుండగా, కాగ్నా, కాక్రవేణి, మల్కందాని ప్రాజెక్టుల పరిధిలో ఐదు వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఈ నాలుగు ప్రాజెక్టులను ఆధునికీకరిస్తే గరిష్టంగా 20 వేల హెక్టార్లకు సాగు నీరందించే అవకాశముందని భావించిన ప్రభుత్వం.. పనులకు అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు రూ.44.42 కోట్లు కేటాయించింది. ఎక్కడిపనులు అక్కడే.. నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం వివిధ దశల్లో పనులకు అనుమతులిస్తూ నిధులు కేటాయించింది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టు పనులు కూడా పూర్తికాలేదు. కాక్రవేణి ప్రాజెక్టు పనులను ప్రారంభించి నిధులు ఖర్చు చేసినప్పటికీ పనులు అర్ధంత రంగా నిలిచిపోయాయి. మరోవైపు జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రాణాహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఇప్పటివరకు అతీగతీ లేదు. దీంతో సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు ఇప్పటికీ నిరాశే మిగిలింది. కొత్త ప్రభుత్వమైనా దీనిపై స్పందించాల్సి ఉంది. -
వృథా ఖర్చులకు కళ్లెం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నిధులు నీళ్లలా ఖర్చుచేసే రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం)కు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కొత్తగా నిధులు విడుదల చేయకుండా, అందుబాటులో ఉన్నవాటినే సర్దుబాటు చేసుకోవాలని స్పష్టం చేయడంలో అధికారులు ఖర్చుపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఖాతాలో ఉన్న నిధులను పొదుపుగా వాడేందుకు ఉపక్రమించారు. ప్రస్తుతం ఆర్వీఎం ద్వారా భారీగా నిధులు ఖర్చు చేసే నివాస, ప్రత్యేక శిక్షణ కేంద్రాలకు(ఆర్‌ఎస్‌టీసీ) కోత పెట్టింది. బడిబయటి పిల్లలకు నివాస వసతి కల్పించి ఉచితంగా చదువు చెప్పడం వీటి ఉద్దేశం. ఈ కేంద్రాలు స్వచ్ఛంద సంస్థల(ఎన్జీఓ) ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అయితే వీటి నిర్వహణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఏడాది పలు కేంద్రాలకు కోత పెట్టి.. ఈ నిధులను విద్యా బోధకులపై ఖర్చు చేసేందుకు జిల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు దృష్టి సారించారు. ఏటా రూ.కోటిన్నర ఆదా జిల్లాలో 39 ఆర్‌ఎస్‌టీసీలు కొనసాగుతుండగా.. మూడు నెలల క్రితం వీటి కాలపరిమితి ముగిసింది. అయితే కొత్తగా రెన్యూవల్ చేస్తే మళ్లీ ఈ కేంద్రాలు కొనసాగే అవకాశ ం ఉంటుంది. కొత్తవాటి కి అనుమతిచ్చే అంశంలో ఆర్వీఎం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ కేంద్రాల ఏర్పాటు ఎక్కడ అవసరమనే దానిపై అధికారులు సర్వే నిర్వహించారు. ఈ ఏడాది 27 కేంద్రాలకు అవకాశం ఉందని నిర్థారించారు. ఒక్కో ఆర్‌ఎస్‌టీసీ ద్వారా నెలకు సగటున రూ.లక్షన్నర ఖర్చు చేస్తున్నారు. తాజాగా 12 కేంద్రాలకు కోత పెట్టడంతో జిల్లా ఆర్వీఎంకు భారీగా నిధులు మిగిలిపోనున్నాయి. ఈ ఏడాది దాదాపు రూ.1.5కోట్లు మిగిలిపోనున్నాయి. ఇలా మిగిలిన నిధులను ఇతర ప్రాధాన్య త అంశాలపై ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకుం టోంది. అదేవిధంగా కొత్త ఆర్ఎస్టీసీల నిర్వహణ పైనా ఆర్వీఎం ప్రత్యేక ప్రణాళిక తయారుచేస్తోంది. అదనంగా విద్యా బోధకులు జిల్లాలో టీచర్ల కొరత ఉంది. కొత్తగా డీఎస్సీ నిర్వహిస్తామని విద్యా సంవత్సరం ప్రారంభంలో సర్కారు ప్రకటించినప్పటికీ.. అనివార్య కారణాలతో వాయి దా పడింది. దీంతో ఈ ఏడాది జిల్లాలో 646 విద్యా బోధకులను కాంట్రాక్టు పద్ధతిన నియమించారు. అయినప్పటికీ జిల్లాలో టీచర్ల కొరత ఉండడంతో అక్కడ ప్రత్యేకంగా విద్యా బోధకులను నియమించేందుకు ఆర్వీఎం అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆర్‌ఎస్‌టీసీలకు కోత పెట్టడంతో మిగిలిపోయే నిధులను విద్యా బోధకులపై ఖర్చు చేయనున్నారు. టీచర్ల ఖాళీలు అధికంగా ఉన్న ఎనిమిది గ్రామీణ మండలాల్లో అదనంగా వంద మంది విద్యాబోధకులను నియమించనున్నట్లు ఆర్వీఎం అధికారులు చెబుతున్నారు.