'నూటికి నూరు శాతం కొత్త సచివాలయం నిర్మిస్తాం'
హైదరాబాద్: నూటికి నూరు శాతం కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణలో కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరుతామన్నారు. సచివాలయానికి వాస్తు బాగోలేదంటే నానాయాగి చేశారన్నారు.
హెచ్ వో డీలన్నీ ఒకే చోట ఉంటే తప్పేంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఏపీ సీఎం, మంత్రులను గౌరవించాలని అధికారులకు చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు. ఏపీ ఉద్యోగులు మరో కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లో అభ్యంతర లేదని కేసీఆర్ తెలిపారు. ఏపీ నుంచి జీతాలు తీసుకుని తమకు ట్యాక్స్ కడితే మంచిదన్నారు.