ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు నిమ్స్‌లో చికిత్స | NIMS Treatment for Frontline Warriors of Coronavirus | Sakshi
Sakshi News home page

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు నిమ్స్‌లో చికిత్స

Published Thu, Jul 9 2020 6:42 AM | Last Updated on Thu, Jul 9 2020 6:43 AM

NIMS Treatment for Frontline Warriors Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 రోగులకు చికిత్స అందిస్తూ వైరస్‌ బారిన పడిన వైద్యులు, వైద్య సిబ్బందికి నిమ్స్‌లో చికిత్స చేయించడానికి వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పంజగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిలో వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం సమ్మతించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు నిమ్స్‌ డైరెక్టర్‌కు లేఖ రాశారు.

కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తూ చాలా మంది వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారని, ఈ నేపథ్యంలో వారందరికీ నిమ్స్‌లో చికిత్స అందించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై జేఏసీ నేతలు రమేశ్, వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్, నరహరి తదితరులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement