అగ్రదేశాల చెంతన సాంకేతిక కళాశాల
ఆనందోత్సవాల్లో విద్యార్థులు, ఫ్యాకల్టీ
నిట్ క్యాంపస్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో బెస్ట్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌గా పేరు సంపాదించిన వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్ బీఏ) గుర్తింపుతో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కాగా, నిట్‌లోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల క్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు వచ్చినట్లు ఈనెల 18న నిట్ డెరైక్టర్‌కు ఫ్యాక్స్ ద్వారా సమాచారం అం దింది. కాగా, ఎన్‌బీఏ గుర్తింపుతో ఇక్కడ చది విన విద్యార్థులకు వాషింగ్టన్‌లోని అక్రాడ్ దేశాల్లోని విదేశీ విద్యార్థులతో ఇంజినీరింగ్ విద్య లో లక్ష్యాలను అధిగమించడానికి ఏ విధమైన కృషి చేయాలనే అంశాలను తెలుసుకునే అవకాశం లభించింది.
నాలుగు కోర్సులకు గుర్తింపు..
నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్‌బీఏ) బృందం ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 12 తేదీ వరకు మూడు రోజుల పాటు నిట్‌లో పర్యటించింది. కాగా, నిట్‌లోని అండర్ గ్రా డ్యుయేట్, పీజీ కోర్సులకు సంబంధించి ఎన్‌బీఏ గుర్తింపు కోసం యాజమాన్యం 2008లో దరఖాస్తు చేసుకుంది. అయితే ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది ఎన్‌బీఏ బృందం నిట్‌లోని అన్ని బీటెక్ విభాగాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీ చేసింది. ఇందులో భాగంగా తొలి విడతగా బీటెక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోర్సులకు గుర్తింపును ఇవ్వడంతో నిట్ తొలిసారిగా అంతర్జాతీయస్థాయిలో పేరు సంపాదించింది.
అగ్రదేశాల సరసన..
వాషింగ్టన్ అక్రాడ్ అనేది ఇంటర్‌నేషనల్ అం డర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన అగ్రిమెంట్. అయి తే ఎన్‌బీఏ గుర్తింపుతో వరంగల్ నిట్ తాజాగా వాషింగ్టన్ అక్రాడ్‌లో స్థానాన్ని సంపాదించుకుంది. వాషింగ్టన్ అక్రాడ్ 1989లో ఏర్పాైటైం ది. అయితే ఇంటర్నేషనల్ అండర్ గ్రాడ్యుయే ట్ ప్రోగ్రాంల ద్వారా ఇంజినీరింగ్ విద్యలో నైపుణ్యాలను, జ్ఞానాన్ని, సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంతోపాటు గ్లోబల్‌గా క్వాలిటీ ఇంజినీర్లను తయారుచేసి వారికి ఉపాధి అవకాశాలను అందించడం దీని ఉద్దేశం. ఇందులో భాగంగా వాషింగ్టన్ అక్రాడ్ అగ్రిమెంట్‌పై ఈ ఏడాది జూన్ 13న ఎన్‌బీఏ(ఇండియా) సంత కం చేసింది. ఇదిలా ఉండగా, వాషింగ్టన్ అక్రాడ్‌లో ఇండియా 17వ దేశం కావడం విశేషం. కాగా, వాషింగ్టన్ అక్రాడ్‌లో యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునెటైడ్ కింగ్‌డమ్ వంటి అగ్రదేశాలు ఉన్నాయి. అలాగే యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునెటైడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కెనడా, తైవాన్, హంగ్‌కాంగ్, ఐర్లాండ్, జపాన్, మలేషియా, కొరియా, న్యూ జిలాండ్, రష్యా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, టర్కీ, శ్రీలంక, ఇండియా ఉన్నాయి. ఇదిలా ఉండగా, నిట్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావడంతో ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు అంతర్జాతీయంగా ఇంజినీరింగ్‌లో నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంచుకునే అవకాశం లభించింది.
డెరైక్టర్‌కు అభినందనలు తెలిపిన చైర్మన్..
నిట్ డెరైక్టర్ టి.శ్రీనివాసరావుతో పాటు ఫ్యాకల్టీ, స్టూడెంట్స్‌తో పాటు ఉద్యోగులకు నిట్ బో ర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణా ఎం.ఎల్లా అభినందన సందేహం పంపించారు. ఎన్‌బీఏ గు ర్తింపు కోసం అహర్నిషలు కృషి చేశారని కొ నియాడారు. ఈ మేరకు ఫ్యాకల్టీ, విద్యార్థులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు.
నిట్ కోర్సులకు ‘ఎన్‌బీఏ’ గుర్తింపు
Published Sun, Dec 21 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM
Advertisement
Advertisement