గుండెల్లో పెట్టి చూసుకుంటాం: కవిత | nizamabad mp kavitha gave assurance to people, party workers | Sakshi
Sakshi News home page

గుండెల్లో పెట్టి చూసుకుంటాం: కవిత

Published Sat, May 24 2014 10:28 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

గుండెల్లో పెట్టి చూసుకుంటాం: కవిత - Sakshi

గుండెల్లో పెట్టి చూసుకుంటాం: కవిత

నిజామాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి అఖండి విజయాన్ని సాధించి పెట్టిన జిల్లా ప్రజలను, కార్యకర్తలను  గుండెల్లో పెట్టి చూసుకుంటామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎలాంటి పైరవీలకు తావులేకుండా, పారదర్శక పాలన అందిస్తామన్నారు. బాల్కొండ టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్వంలో నిర్వహించిన ఎంపీ, ఎమ్మెల్యేల అభినందన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బంగారు తెలంగాణను చూడాలన్న ఆకాంక్షతో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన తెలంగాణ ప్రజల రుణం ఏమిచ్చినా తీరదన్నారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 14 ఏళ్ల అలుపెరగని పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందన్నారు. ప్రజల విశ్వసించి అధికారాన్ని కట్టబెట్టారని కవిత పేర్కొన్నారు.ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ప్రతి అంశాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement