పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు అమలవుతున్న ఆరోగ్య భద్రత పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు అమలవుతున్న ఆరోగ్య భద్రత పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం రూపొందించిన జాబితాలో పేర్కొన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు చికిత్స పొందవచ్చునని తెలిపారు.
చికిత్స పొందిన పోలీసులు ‘ఆరోగ్య భద్రత’ కార్యదర్శి ఆమోదంతో వైద్య బిల్లులను వైద్య విద్య డెరైక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని మెడికల్ రీయింబర్స్‌మెంట్ పొందవచ్చునని సూచించారు. దీనిపై తెలంగాణ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.