
ఎడపల్లి(బోధన్): అందరూ ఉన్నా అనాథల్లా మారిన వృద్ధ దంపతులు, నివసించేందుకు నీడ లేక మరుగుదొడ్డినే ఇల్లుగా మార్చుకుని జీవనం సాగిస్తున్నారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన బెజ్జంకి మల్లయ్య(82), మైసమ్మ(70) దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వృత్తిరీత్యా ఒకరు జిల్లా కేంద్రంలో పెయింటింగ్ పని చేస్తుంటాడు. మరొక కొడుకు దుబాయ్‌లో ఉంటున్నాడు. ఆయన భార్య, పిల్లలు పోచారంలో నివసిస్తున్నారు.
వృద్ధాప్యంలో అయినవారు ఎవరూ చూడకపోవడంతో కొన్నేళ్లుగా పోచారంలో కొడుకు ఇంటి ఆవరణలో ఉన్న మరుగుదొడ్డిలో నివాసం ఉంటూ, కూలీనాలీ చేసి పొట్టపోసుకుంటున్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు గ్రామా నికి వెళ్లగా వారి పరిస్థితి వెలుగులోకి వచ్చింది. తమను ఆదుకోవాలని ఆ వృద్ధ దంపతులు కాంగ్రెస్ నాయకులను వేడుకున్నారు. దీంతో వారు స్పందించి తాము అధికారంలోకి రాగానే అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment