టీఆర్‌ఎస్‌తో దోస్తీ లేదు: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో టీఆర్‌ఎస్, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ చేరుతుందని వస్తున్న వార్తలన్నీ గాలి వార్తలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంలో చేరుతామని టీఆర్‌ఎస్ కోరలేదని, చేరాలని బీజేపీ కూడా అడగలేదని తెలిపారు. తమ పార్టీకి సంబంధించి ఏ సమావేశాల్లోనూ ఈ విషయంపై ప్రస్తావన రాలేదన్నారు. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ ప్రధాన కార్యదర్శులతో మాట్లాడానని, టీఆర్‌ఎస్ చేరికపై ఎక్కడా చర్చ జరగలేదని తెలిపారు. పార్టీ, ప్రజల్లో అయోమయం సృష్టించడానికే ఇలాంటి గాలివార్తలు సృష్టిస్తున్నారన్నారు.