TRS join
-
తప్పు చేయకపోతే చర్చకు సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్న విషయంలో సీఎం కేసీఆర్ తప్పు చేయకపోతే తనతో చర్చకు సిద్ధం కావాలని, ఆ చర్చ ఎక్కడ పెట్టినా వస్తానన్నానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సవాల్ చేశారు. పదో షెడ్యూల్లో ఫిరాయింపుల ఉన్న నిబంధనలను పూర్తిగా విస్మరిస్తున్న కేసీఆర్ ప్రగతిభవన్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కేసీఆర్ ఎక్కడో దాక్కుని ఇతర నాయకులను మాట్లాడిస్తున్నారని, ఆయన్ను బయటకు ఎలా రప్పించాలో తమకు తెలు సని అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా హాల్ లో భట్టి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా స్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోందని, ఈ పొలిటికల్ మాఫియాను ఆపకపోతే ప్రజల ఓటుకు విలువ ఉండదని చెప్పారు. భవిష్యత్తులో డబ్బున్న వాళ్లంతా ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేసి సీఎంలు, పీఎంలు అవుతారని, అందుకే తాను ఆమరణదీక్షకు కూర్చున్నానని అన్నారు. తన దీక్షకు మద్దతు ఇచ్చినవారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తన పోరాటం ఆరంభం మాత్రమేనని , రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనపై తాను, కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై త్వరలోనే వివిధ వర్గాల మేధావులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్‌కు నాయకత్వం లేదని పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెపుతున్నారని, కాంగ్రెస్‌కు ఎన్నికల ముందు, ఆ తర్వాత వారే నాయకులుగా ఉన్నారని, అప్పుడు పార్టీ నుంచి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే వెళుతున్నామని చెబుతున్నారని, పార్టీ మారకపోతే ఈ ప్రభుత్వ పెద్దలు విపక్ష నేతల నియోజకవర్గాలను అభివృద్ధి చేయరా అని ప్రశ్నించారు. పార్టీ మారిన వారంతా రాజీనామా చేసి దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో గెలవాలని భట్టి సవాల్ విసిరారు. -
టీఆర్ఎస్లోకి సునీతా లక్ష్మారెడ్డి!
సాక్షి, మెదక్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెతుకుసీమలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)తో మంగళవారం ఆమె హైదరాబాద్‌లో సమావేశమైనట్లు తెలిసింది. చర్చల అనంతరం సీఎం కేసీఆర్‌తోనూ ఆమె ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. వచ్చే నెల మూడో తేదీన నర్సాపూర్‌లో జరిగే మెదక్ లోక్‌సభ నియోజకవర్గ బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. అయితే.. సునీతా లక్ష్మారెడ్డి ‘కారు’ఎక్కనున్నారనే సమాచారంతో కాంగ్రెస్‌కు చెందిన పలువురు కీలక నేతలు ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫోన్లో ఆమె అందుబాటులో లేకపోవడంతో ఆమె అనుచరులు, బంధువుల వద్దకు వెళ్లి మాట్లాడినట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ విజయం సునీతా లక్ష్మారెడ్డి మూడు పర్యాయాలు (1999, 2004, 2009) కాంగ్రెస్ నుంచి నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో సీపీఐకి చెందిన చిలుముల కృష్ణారెడ్డిపై 13,274 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. అయితే 2014 సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నిక, ఆ తర్వాత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అంచెలంచెలుగా ఎదిగిన సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌లో అనేక పదవులు నిర్వహించారు. తొలుత బీజేపీలోకి అంటూ.. ఇటీవల గద్వాల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి డీకే.అరుణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఆమెతో కలసి సునీతా లక్ష్మారెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండటంతో సునీత లక్ష్మారెడ్డి సైతం బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఆమె ఖండించారు. అయితే.. అరుణ ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ సునీత ససేమిరా అన్నట్లు తెలిసింది. కేటీఆర్‌తో వరుస భేటీలు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ పటిష్టతపై కె.తారకరామారావు ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా జిల్లాల వారీగా పార్టీ నాయకులు, ముఖ్య అనుచరులతో సమావేశాలు జరుపుతున్నారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంపై ఆయన మరింత దృష్టి పెట్టారు.ఈ క్రమంలో ఇటీవల సునీతా లక్ష్మారెడ్డి మూడు, నాలుగు పర్యాయాలు కేటీఆర్‌ను కలసి చర్చి ం చినట్లు తెలిసింది. పార్టీ పటిష్టతలో భాగంగా టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నామని.. తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఆమెతో కేటీఆర్ అన్నట్లు సమాచారం. అంతేకాకుండా సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో కూడా ఫోన్లో మాట్లాడించినట్లు తెలిసింది. -
కాంగ్రెస్‌కు మరో షాక్.. ఎమ్మెల్యే హరిప్రియ రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ’హస్తం’ కు చేయిచ్చి కారు ఎక్కేందుకు సిద్ధమయిన విషయం తెలిసిందే. ఇప్పటికే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్ఎస్లోకి సబితా ఇంద్రారెడ్డి..! తాజాగా ఖమ్మం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. అవసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ బీఫాంపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు. మరోవైపు మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరికపై ఇప్పటికే ఆమె...టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో చేరికపై రేపు ఉదయం (సోమవారం) తన అనుచరులతో సబితారెడ్డి సమావేశం కానున్నారు. కార్యకర్తల భేటీ అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. కాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో పార్టీ నేతలు టీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ కు చిక్కడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో గుబులు రేపుతోంది. పార్టీ మారుతున్నట్లు వార్తల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డితో కాంగ్రెస్ నేతలు భేటీ బుజ్జగింపుల పర్వం చేపట్టినా అవి సఫలం కాలేదని తెలుస్తోంది. -
కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్ఎస్లోకి సబిత ..!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వారిమధ్య సంధి కుదిర్చినట్లు సమాచారం. ఒవైసీ ఇంట్లోనే కేటీఆర్-సబిత భేటీ అయ్యారని, కార్తిక్ రెడ్డితో పాటు ప్రధాన అనుచరులంతా టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే కార్తిక్‌కు ఎంపీ టికెట్ లేదా తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తోంది. నిన్న జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభలో కూడా పార్టీ అధిష్టానంపై సబిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా కేటీఆర్‌తో భేటీ వార్తలపై సబిత ఇప్పటి వరకు స్పందించలేదు. చేవెళ్ల బరిలో ఎవరో.. కాగా ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై కార్తిక్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ముందు అధికార టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదునుపెట్టింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా పార్టీని వీడుతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కీలకంగా భావించే లోక్‌సభ ఎన్నికల ముందు ఇలా ముఖ్య నేతలంతా వీడుతుండటం పార్టీ నాయకత్వానికి తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మరెంత మంది నేతలు పార్టీకి గుడ్‌బై చెప్తోరోనని పార్టీ నేతల్లో అలజడి మొదలైంది. టీఆర్ఎస్లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు! -
ప్రజాకోర్టులో తేల్చుకుంటాం
సాక్షి, హైదరాబాద్: మాయమాటలు చెప్పే మాయ కూటములను నమ్మితే ప్రజలకు కష్టాలు తప్పవని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు 200 కేసులు వేశారని చెప్పారు. ప్రజా కోర్టులో తీర్పు కోస మే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ఆర్యవైశ్య ఫెడరేషన్ నేత ఉప్పల శ్రీనివాస్‌గుప్తా టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో ఆయనకు గులా బీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. ‘పేదరికానికి కులం, మతం ఉండదు. రాష్ట్రంలో పేదలందరికీ న్యాయం జరిగేలా కేసీఆర్ కృషి చేస్తున్నా రు. సామాజిక పింఛన్ల కింద రూ.200 ఇచ్చిన కాం గ్రెస్ నేతలు ఎక్కడాలేని బిల్డప్ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే సీఎం కేసీఆర్ ఈ పింఛన్లను రూ.1,000, రూ.1500కి పెంచారు. ఆర్థికంగా వెనుకబడ్డ వారికోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. కేసీఆర్ వచ్చే ఎన్నికల కోసమే కాకుండా వచ్చే తరాల కోసం ఆలోచిస్తున్నారు. నాలుగేళ్లలో కాంగ్రెస్ పవర్ కట్ అయితేనే రైతులకు 24 గంటల కరెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గెలిస్తేనే ఇది కొనసాగుతుంది. కేసీఆర్ మట్టిబిడ్డ, రైతుబిడ్డ కాబట్టే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లా ఉంది. కాంగ్రెస్‌లో అందరూ సీఎం అభ్యర్థులే. కాంగ్రెస్ నేతలు ఒకవైపు ఎన్నికలకు సై అంటూనే మరోవైపు కోర్టుల్లో కేసులు వేశారు. ఇంటి కిరాయి కడతామని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. రూ.15 లక్షలు ప్రజల అకౌంటులో వేస్తే బీజేపీ నేతల ఇంటి కిరాయి కూడా ప్రజలే కడతారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశారు. మహాకూటమి గెలిస్తే బాబు ప్రాజెక్టులను కట్టనిస్తాడా? వారు నాదాన్ దుష్మన్లు. పేద ఆర్య వైశ్యులకు న్యాయం చేసే బాధ్యత టీఆర్ఎస్పై ఉంది’ అని అన్నారు. పలువురి చేరిక.. టీడీపీ దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జి వ్యాసనాయక్, టీడీపీ నేత కంకణాల వెంకట్‌రెడ్డి.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 11 మంది మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు కేటీఆర్ సమక్షంలో బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన రామచంద్రరావు, మధుసూదన్‌రావులు కూడా టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో నారాయణపేట టీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మొదటిసారిగా బంజారా భాషలో వీడియో రూపంలో రూపొందించిన పాటను కేటీఆర్ ఆవిష్కరించారు. ఉత్తమ్‌పై జగదీశ్‌రెడ్డి పోటీ చేయాలి: శంకరమ్మ తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు బుధవారం తెలంగాణభవన్‌కు వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ‘నాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మద్దతు ఉంది. మంత్రి జగదీశ్‌రెడ్డి నాకు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నాడు. నియోజకవర్గంలో పని చేయని సైదిరెడ్డికి టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. నాకు టికెట్ రాకపోతే జగదీశ్‌రెడ్డిదే బాధ్యత. నేను సూర్యాపేట నుంచి పోటీ చేస్తా. మంత్రి జగదీశ్‌రెడ్డి హుజూర్నగర్ నుంచి ఉత్తమ్‌పై పోటీ చేయాలి. నాకు ఎమ్మెల్సీ వద్దు.. ఏ పదవులు వద్దు. నేను ప్రజల మద్దతుతోనే గెలుస్తా. నాకు టికెట్ రాకుంటే జగదీశ్‌రెడ్డి ఇంటిముందు శ్రీకాంతాచారిలాగా ఆత్మాహుతి చేసుకుంటా’ అని పేర్కొన్నారు. -
రేవంత్ టీఆర్ఎస్లోకి వస్తానన్నాడు: తలసాని
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు తనతో సంప్రదింపులు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చోటు దక్కకపోవడంతోనే కాంగ్రెస్‌లో చేరారని వ్యాఖ్యానించారు. సహచర మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డితో కలసి గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో యాదవులకు గొర్రెలు పంపిణీ చేశారు. తలసాని మాట్లాడుతూ ‘‘నేను టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత రేవంత్ కూడా వస్తానని నాతో మాట్లాడిండు. పార్టీలో చేర్చుకోమని కోరితే ఈ విషయాన్ని సహచర పాలమూరు మంత్రుల దృష్టికి తీసుకెళ్లా.. వాడు పెద్ద దొంగ, అలాంటోళ్లను తీసుకోవద్దు అని వారు అన్నరు. అందుకే రేవంత్‌కు టీఆర్ఎస్లో చోటు దక్కలేదు’’ అని మంత్రి వివరించారు. ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లినప్పుడు కొడంగల్ పౌరుషం ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. గొల్ల, కురుమల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్.. శంషాబాద్‌లో 10 ఎకరాలు కేటాయించేందుకు అంగీకరించారని మంత్రి తెలిపారు. ఈ భూమిలో రూ.5 కోట్లతో గొల్లలకు, మరో రూ.5 కోట్లతో కురుమల సంక్షేమ భవనాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఆ స్థలంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం హాస్టల్ కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. -
టీఆర్ఎస్లో చేరికకు రంగం సిద్ధమైందా?
సాక్షి, యాదాద్రి : ఉమ్మడి నల్లగొం డ జిల్లా టీడీపీలో విభేదాలు మరో సారి బట్టబయలయ్యాయి. టీడీపీ సీనియర్ నేతలు, పొలిట్‌బ్యూరో సభ్యులైన మోత్కుపల్లి నర్సింహులు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి వర్గాలు రెండుగా చీలిపోయాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ వర్గ పోరులో చెరోవైపు నాయకత్వం వహిస్తున్నారు. తాజాగా సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన రైతు దీక్షకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణతోపాటు మోత్కుపల్లి నర్సింహులు మాత్రమే హాజరయ్యారు. మరో సీనియర్ నేత ఉమామాధవరెడ్డి రాలేదు. దీంతో ఇటీవల ఆమె టీఆర్ఎస్లో చేరుతారని వచ్చిన ఊహగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. మొదటి నుంచి గ్రూపులే... టీడీపీలో ముందు నుంచి జిల్లాలో రెండు గ్రూపులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎలిమినేటి మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఇరుగుపొరుగు నియోజకవర్గాల్లో నేతలైనప్పటికీ ఎప్పుడు రెండు గ్రూపులుగా ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించారు. మాధవరెడ్డి మరణానంతరం ఆయన సతీమణి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, అప్పటి నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు ఒకవర్గంగా, మోత్కుపల్లి నర్సింహులు మరో వర్గంగా కొనసాగుతూ వచ్చారు. మారుతూ వచ్చిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చివరికి ఉమ్మడి జిల్లా టీడీపీలో మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డి ఇద్దరు సీనియర్ నేతలు మిగిలారు. ఈనేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులు టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. రేవంత్‌రెడ్డి పార్టీని వీడిన నేపథ్యంలో జిల్లా టీడీపీ చెల్లాచెదురైంది. అందరూ రేవంత్‌రెడ్డి వెనుక కాంగ్రెస్‌లోనే చేరుతారని అనుకున్నప్పటికీ కొందరు టీఆర్ఎస్లో చేరారు. ఉమ్మడి జిల్లాకు చెందిన బిల్యానాయక్, పటేల్ రమేశ్‌రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరగా, కంచర్ల భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు పలువురు ముఖ్యనేతలు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తాజాగా ఉమామాధవరెడ్డి టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం బలంగా సాగుతుంది. ఇటీవల సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్‌ను వ్యక్తిగత పనులపై కలిశారు. ఈ నేపథ్యంలోనే ఆమె టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే నెల మొదటివారంలో టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. మరోవైపు సోమవారం ఆమె సీఎం క్యాంప్ కార్యాలయానికి మరోసారి వెళ్లినట్లు సమాచారం సాగుతోంది. ఈవిషయంపై ఎలిమినేటి ఉమామాధవరెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా తాను సీఎం క్యాంప్ కార్యాలయానికి ఈరోజు వెళ్లలేదని, కావాలని కొందరు మాపార్టీలో ఉన్నవారే నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. -
టీఆర్ఎస్తో దోస్తీ లేదు: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ చేరుతుందని వస్తున్న వార్తలన్నీ గాలి వార్తలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంలో చేరుతామని టీఆర్ఎస్ కోరలేదని, చేరాలని బీజేపీ కూడా అడగలేదని తెలిపారు. తమ పార్టీకి సంబంధించి ఏ సమావేశాల్లోనూ ఈ విషయంపై ప్రస్తావన రాలేదన్నారు. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ ప్రధాన కార్యదర్శులతో మాట్లాడానని, టీఆర్ఎస్ చేరికపై ఎక్కడా చర్చ జరగలేదని తెలిపారు. పార్టీ, ప్రజల్లో అయోమయం సృష్టించడానికే ఇలాంటి గాలివార్తలు సృష్టిస్తున్నారన్నారు.