కోతలుండవ్‌.. | No Power Cuts In Telangana This Summer | Sakshi
Sakshi News home page

కోతలుండవ్‌..

Published Thu, Mar 29 2018 7:57 AM | Last Updated on Thu, Mar 29 2018 7:57 AM

No Power Cuts In Telangana This Summer - Sakshi

జిల్లా కేంద్రంలోని 33/11కేవీ సబ్‌ష్టేషన్‌ 

గద్వాల అర్బన్‌ : ఒకవైపు నిరంతర సరఫరా, మరోవైపు వేసవి దృష్ట్యా విద్యుత్‌ వినియోగం అమాంతం పెరిగింది. దీంతో ట్రాన్స్‌కో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలోని అన్ని సబ్‌స్టేషన్లలో ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచుతున్నారు. అలాగే మరమ్మతు నిమిత్తం నిధులు మంజూరయ్యాయి. ఇక వేసవితోపాటు వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లోనూ విద్యుత్‌ సరఫరాకు డోకా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది జనవరి 1 నుంచి వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తోంది.

దీంతో ఆ నెలలో విద్యుత్‌ వినియోగం రెండింతలు పెరిగింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యుత్‌ అధికారులు గ్రా మాల్లో పర్యటించి ఆటోమెటిక్‌ స్టార్లర్ల తొలగింపుపై రైతులకు అవగా హన కల్పించారు. బోర్లలోనూ నీటిమట్టం తగ్గిపోవడంతో క్రమేణా వినియోగం తగ్గింది. మార్చి నుంచి వేసవి ప్రారంభమైంది. వ్యవసాయ రంగానికేగాక ప్రజలు సైతం కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగంతో డి మాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పడి ఓల్టేజీ తగ్గింది. 

ట్రాన్స్‌కో అధికారులు అప్రమత్తత
అప్రమత్తమైన అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల బిగింపు, కెపాసిటర్‌ బ్యాంకుల కొనుగోలుకు రూ.ఆరు కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో 33/11కేవీ సబ్‌స్టేషన్లు 45అందుబాటులో ఉన్నాయి. నిరంతర విద్యుత్‌ సరఫరా, వేసవి దృష్ట్యా వీటిలోని 38చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక భారం పడటంతో కెపాసిటర్‌ బ్యాంకులు అమర్చనున్నారు. ఒక్కోటి రూ.12లక్షలు (2ఎంబీఏఆర్‌ సామర్థ్యం) ఉంటుంది. వీటి ఏర్పాటుతో ట్రాన్స్‌ఫార్మర్లపై భారం తగ్గడమేగాక లోఓల్టేజీ సమస్య తీరుంది. రూ.మూడు కోట్లతో అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫ్మార్లను అమర్చనున్నారు.

ముఖ్యం గా నర్సన్‌దొడ్డి, రేవులపల్లి, మల్లాపురంతండా, మారమునగాల, ఉత్తనూరు, మానవపాడు, జమ్మిచేడు, రాజోళి తదితర ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు బిగించనున్నారు. అలాగే చింతలకుంట సబ్‌స్టేషన్‌లో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు 5ఎంఎల్‌వీ 8ఎంఎల్‌వీ, మాన్‌దొడ్డిలో 3.15 నుంచి 5ఎంఎల్‌వీగా సామర్థ్యం పెంచనున్నారు. మిగతా చోట్ల సింగిల్‌ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో డబుల్‌ పెంచనున్నారు. ప్రస్తు త వేసవితోపాటు వచ్చే జూన్‌లో ప్రారంభమయ్యే ఖరీఫ్‌లోనూ విద్యుత్‌ సరఫరాకు డోకా లేదని అధికారులు చెబుతున్నారు. అయితే విద్యుత్‌ స్తంభాలు, వైర్ల మరమ్మతు, కొత్త పరికరాలు అమర్చాలని రైతులు, వినియోగదారులు కోరుతున్నారు. 

అంచనాలు పంపించాం
వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్‌ సరఫరా, వేసవి కాలం దృష్ట్యా జిల్లాలో విద్యుత్‌ విని యో గం అమాంతం పెరిగింది. దీంతో కొన్ని  సబ్‌స్టేషన్లలోని ట్రాన్స్‌ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కెపాసిటర్‌ బ్యాంకులు, అడిషనల్‌ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు నిధులు వచ్చాయి. పనుల అంచనా తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలోనే ఈ పనులు తప్పక చేపడతాం.                
– సీహెచ్‌ చక్రపాణి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, గద్వాల 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement