రుణమాఫీపై ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కు లేదు: పోచారం
హైదరాబాద్: రైతు రుణమాఫిపై ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని టీఆర్ఎస్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. రుణమాఫీపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని, ఆ పార్టీ నేతలు ధర్నాలు సమంజసం కాదని టీఆర్ఎస్ నేత, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, రుణమాఫీని వందశాతం అమలు చేసి తీరుతామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం తెలిపారు. ఉప ఎన్నికల సమయంలో తమ పార్టీపై అరోపణలు చేస్తూ కాంగ్రెస్ తమ స్థాయిని దిగజార్చుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీని అమలు చేసి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు.