నగర బస్టాండ్‌లో భద్రత కరువు
మూలన పడిన సీసీ కెమెరాలు
పోలీసు రక్షణ కూడా అంతంతే
తరచూ జరుగుతున్న చోరీలు
పట్టించుకోని ఆర్‌టీసీ అధికారులు
నిజామాబాద్ అర్బన్ : జిల్లాకు కీలకంగా ఉన్న నిజామాబాద్ ఆర్‌టీసీ బస్టాండ్‌లో పోలీసుల నిఘా కరువైంది. దీంతో ప్రయూణికులకు భద్రత లేకుండాపోతోంది. ఇక్కడి నుంచి రోజూ దాదాపు రెండు లక్షల మంది వివిధ ప్రాంతాలకు ప్రయూణిస్తూ ఉంటారు. వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటారుు. జరగరాని సంఘటనలు జరిగితే చర్చనీయూంశమవుతోంది. భద్రత అటుంచితే ఇక్కడ నిఘా ఏర్పాట్లు, కనీస సౌకర్యాలు కూడా లేవు.
అంతా గందరగోళం
జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌కు జిల్లాలోని ఆరు డిపోలు, తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి బ స్సుల రాకపోకలు ఉన్నాయి. మ హారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నిత్యం 66 బస్సులు వస్తూ,పోతూ ఉంటారుు. అసలే బస్టాండ్ చిన్నదిగా ఉండడంతో ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఈ మేరకు తగు ఏర్పాట్లు చేయడంలో ఆర్‌టీసీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. ప్రయాణికుల అవసరం మేరకు ప్లాట్‌ఫారాల విస్తరణ జరుగలేదు. బస్టాండ్‌లో 38 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. అన్ని ప్లాట్‌ఫారాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది.
దీనికి తోడు బస్టాండ్‌లో దుకాణాల కే టాయింపు కూడా ఇష్టారాజ్యంగా ఉండడంతో గందరగోళంగా ఉంది. అనుమానస్పదంగా తిరిగే వ్యక్తులను గుర్తించ డం కష్టమైన విషయం. పోలీసు భద్రత మాత్రం తక్కువగా ఉంది. ఒక హెడ్‌కానిస్టేబుల్ సహా మరో ముగ్గురు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తుంటారు. వీ రు బస్టాండ్ అంతటా సరిగా నిఘా పెట్టలేకపోతున్నారు. తరచూ దొంగతనాలు జరగడం రివాజుగా మారింది. ప్రతి నెలలో సుమారు 10 నుంచి 15 వరకు దొంగ త నాల కేసులు నమోదు అవుతాయి. వీటిని నియంత్రించడంలోనే పోలీసులు విఫలమవుతున్నారు.
అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడమెలా!
అసాంఘిక కార్యకలాపాలు, సంఘవిద్రోహ చర్యలకు సంబంధించి నివారణ, ముందస్తుగానే నివారించే కార్యక్రమాలు కనీసం అందుబాటులో లేవు. బస్టాండ్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు కలగా మారింది. గతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి నెల రోజులు మాత్రమే సని చేసి మూలకు పడిపోయూరుు. ఆ తరువాత వాటిని ప ట్టించుకునేవారే లేరు. బస్టాండ్‌లో అస లే రద్దీ....అనుమానస్పద వ్యక్తులను గుర్తించడం పోలీసులకు సైతం సా ధ్యంకాని పని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు.
ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే గుర్తించడం కూడా కష్టతరమైన విషయం. పైగా బస్టాండ్‌లో షాపుల కేటాయింపు ఇష్టా రా జ్యంగా ఉండడంతో ఎక్కడ ఏ వస్తువు ఎవరిది అనేది గుర్తించడానికి వీలులేకుండా పోరుుంది. సైకిల్‌స్టాండ్లు కూడా బస్టాండ్‌కు అనుకొని ఉంటాయి. బస్టాండ్ ప్రాంతంలోనే వివిధ ప్రాంతాల బస్సులు నిలిపి ఉంచుతారు. విషయం ఏమిటంటే రాత్రి పూట కరెంటు పోతే జనరేటర్ సౌకర్యం కూడా అందుబాటులో లేదు. ప్రయాణికుల ంతా చీకటిలోనే వేచి చూడాల్సిందే.
ఆదాయంపైనే దృష్టిసారించిన ఆర్‌టీసీ అధికారులు రక్షణ చర్యల కోసం మాత్రం ముందుకు రావడం లేదు. 146 దుకాణాలు ఉ న్నారుు. ఇరుకు సందు ఉంటే చాలు అధికారులు టెండర్ ద్వారా వ్యాపారస్తులకు కేటాయిస్తున్నారు. దీంతో బస్టాండ్ రద్దీగా మారిపోయింది. అధికారులు ఇకనైన స్పం దించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయూలని, బస్టాండ్‌లో పోలీసు భద్రతను మరింత పెంచాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.
నిఘా ఏదీ!
Published Fri, Apr 3 2015 5:17 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement
Advertisement