security drought
-
రాష్ట్రంలో భద్రత కరువు
టీనగర్: రాష్ర్టంలోని శాంతి భద్రతలపై కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పట్టపగలే నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో స్వాతి అనే యువతి దారుణ హత్యకు గురైందన్నారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నేరుగా స్వాతి ఇంటికి వెళ్లి పరామర్శించారని పేర్కొన్నారు. బహిరంగ స్థలంలో జరిగిన ఈ హత్యోదంతంపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల చర్యను పలువురు ఖండిస్తున్నట్లు తెలిపారు. మద్రాసు హైకోర్టు కూడా దీనిపై తీవ్రంగా స్పందించినట్లు పేర్కొన్నారు. న్యాయమూర్తి ఎన్ కృపాకరన్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన ఒక లేఖలో స్వాతికి రక్షణ కల్పించడంలో విఫలమైనందున స్వాతి కుటుంబానికి రైల్వేశాఖ ఎందుకు నష్టపరిహారం చెల్లించకూడదంటూ ప్రశ్నించారన్నారు. చెన్నైలో స్వాతిలాగానే సేలంలో వినుప్రియను కొందరు అసభ్యంగా మార్ఫింగ్ చేయడంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. లేఖలో కరుణానిధి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తె లిపారు. మహిళలకు రక్షణ కరువు: పొన్ రాధాకృష్ణన్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ విమర్శించారు. మంగళవారం పుదుచ్చేరికి చేరుకున్న పొన్ రాధాకృష్ణన్ విలేకరులతో మాట్లాడారు. పుదుచ్చేరి ప్రజలకు అంగీకారయోగ్యం కాని నేతను సోనియాగాంధీ ముఖ్యమంత్రిగా నియమించి కాంగ్రెస్ పార్టీ మహాద్రోహాన్ని తలపెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 17న డీఎంకేలోకి మక్కల్ డీఎండీకే: జులై 17న సేలంలో జరుగనున్న కార్యక్రమంలో డీఎంకే పార్టీలోకి మక్కల్ డీఎండికే చేరనున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రకుమార్ ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటలకు చంద్రకుమార్, పార్థిపన్, సీహెచ్‌శేఖర్ గోపాలపురానికి వెళ్లి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని కలిసి డీఎంకేలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఒక లేఖను అందజేశారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సమక్షంలో కరుణానిధికి శాలువా కప్పి డీఎంకేలో చేరారు. ఆయనతోపాటు నిర్వాహకులు ఏఈ మురుగేశన్, శివకుమార్, సెంథిల్‌కుమార్, రాజా, వేల్మురుగన్ కూడా పార్టీలో చేరారు. అనంతరం చంద్రకుమార్ విలేకరులతో మాట్లాడుతూ తామంతా డీఎంకేలో చేరినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా పర్యటించి డీఎండీకే ఉన్న వారిని డీ ఎంకేలోకి ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. ఇందుకోసం సేలంలో భారీ కార్యక్రమం ఏర్పాటుకానుందన్నారు. డీఎంకేకు దూరం: విజయకాంత్ డీఎంకేతో ఇక ఎన్నటికీ పొత్తులు పెట్టుకోమని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ తెలిపారు. డీఎండీకే కార్మిక సంఘం 11వ వార్షికోత్సవం కోయంబేడులోగల పార్టీ కార్యాలయంలో జరిగింది. ఇందులో విజయకాంత్ కార్యకర్తలతో మాట్లాడారు. ఒక నిర్వాహకుడు మాట్లాడుతూ విజయకాంత్‌ను, పార్టీ చర్యలను విమర్శిస్తూ 14 జిల్లాల కార్యదర్శులు పేరిట విడుదలయిన లేఖపై ఆయా జిల్లా కార్యదర్శులతో విజయకాంత్ విచారణ జరిపారని, ఈ విచారణలో వారు తాము లేఖను రాయనట్లు తెలిపారన్నారు. దీంతో ఈ లేఖకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడికి విజయకాంత్ సూచనలిచ్చినట్లు తెలిపారు. అంతేగాకుండా డీఎండీకేను పతనం చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు జిల్లాల కార్యదర్శులు వీలు కల్పించరాదన్నారు. -
టీడీపీ పాలనలో మహిళలకు భద్రత కరువు
అధికార పార్టీ తీరుపై మండిపడ్డ కత్తెర హెనీ క్రిస్టీనా ఫిరంగిపురం : టీడీపీ పాలనలో మహిళలకు భద్రత కరువైందని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర హెనీ క్రిస్టీనా విమర్శించారు. ఆమె మంగళవారం ఫిరంగిపురంలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మహిళా దినోత్సవాన్ని నిర్వహించే అర్హత అధికార పార్టీ నాయకులకు లేదన్నారు. చంద్రబాబుకు మొదటి నుంచి మహిళలపై సదభిప్రాయం లేదని విమర్శించారు. ఇందుకు ఇటీవల జరిగిన పలు ఘటనలే నిదర్శనమని తెలిపారు. తహశీల్దారు వనజాక్షిని దెందులూరు ఎమ్మెల్యే కొట్టి హింసిస్తే అతనిపై చర్యలు తీసుకోలేదన్నారు. జీతాలు పెంచాలని కోరుతూ విజయవాడలో ధర్నాకు దిగిన అంగన్వాడీలను పోలీసులతో తీవ్రంగా కొట్టించిన ఘనత చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. విద్యార్థిని రిషితేశ్వరి మృతి ఘటనలో సైతం నిందితులను అరెస్ట్ చేసేందుకు మీనమేషాలు లెక్కించారని మండిపడ్డారు. మంత్రి రావెల కుమారుడు సుశీల్ నిస్సిగ్గుగా ఉపాధ్యాయురాలితో వ్యవహరించిన తీరు మరో ఉదాహరణ అన్నారు. కోడలు మగ పిల్లాడిని కంటే అత్త వద్దంటుందా? అని ఢిల్లీలో వ్యాఖ్యానించిన చంద్రబాబుకు మహిళలపై ఉన్న వైఖరిని అర్థం చేసుకోవచ్చన్నారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణకు కూడా మహిళలపై సదభిప్రాయం లేదన్నారు. ఓ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మహిళలను చులకన చేస్తూ అసభ్యకరంగా మాట్లాడటం విచారకరమన్నారు. ఇన్ని తప్పులు చేస్తూ ప్రతి దానికి జగన్‌ను బాధ్యుడిని చేయాలని అధికార పార్టీ నాయకులు, మంత్రులు చూస్తున్నారని విమర్శించారు. మానసిక స్థితి సక్రమంగా లేని రావెలకు వెంటనే చికిత్స అందించాలని ఆమె హితవు పలికారు. -
నిఘా ఏదీ!
నగర బస్టాండ్‌లో భద్రత కరువు మూలన పడిన సీసీ కెమెరాలు పోలీసు రక్షణ కూడా అంతంతే తరచూ జరుగుతున్న చోరీలు పట్టించుకోని ఆర్టీసీ అధికారులు నిజామాబాద్ అర్బన్ : జిల్లాకు కీలకంగా ఉన్న నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసుల నిఘా కరువైంది. దీంతో ప్రయూణికులకు భద్రత లేకుండాపోతోంది. ఇక్కడి నుంచి రోజూ దాదాపు రెండు లక్షల మంది వివిధ ప్రాంతాలకు ప్రయూణిస్తూ ఉంటారు. వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటారుు. జరగరాని సంఘటనలు జరిగితే చర్చనీయూంశమవుతోంది. భద్రత అటుంచితే ఇక్కడ నిఘా ఏర్పాట్లు, కనీస సౌకర్యాలు కూడా లేవు. అంతా గందరగోళం జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌కు జిల్లాలోని ఆరు డిపోలు, తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి బ స్సుల రాకపోకలు ఉన్నాయి. మ హారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నిత్యం 66 బస్సులు వస్తూ,పోతూ ఉంటారుు. అసలే బస్టాండ్ చిన్నదిగా ఉండడంతో ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఈ మేరకు తగు ఏర్పాట్లు చేయడంలో ఆర్టీసీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. ప్రయాణికుల అవసరం మేరకు ప్లాట్‌ఫారాల విస్తరణ జరుగలేదు. బస్టాండ్‌లో 38 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. అన్ని ప్లాట్‌ఫారాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు బస్టాండ్‌లో దుకాణాల కే టాయింపు కూడా ఇష్టారాజ్యంగా ఉండడంతో గందరగోళంగా ఉంది. అనుమానస్పదంగా తిరిగే వ్యక్తులను గుర్తించ డం కష్టమైన విషయం. పోలీసు భద్రత మాత్రం తక్కువగా ఉంది. ఒక హెడ్‌కానిస్టేబుల్ సహా మరో ముగ్గురు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తుంటారు. వీ రు బస్టాండ్ అంతటా సరిగా నిఘా పెట్టలేకపోతున్నారు. తరచూ దొంగతనాలు జరగడం రివాజుగా మారింది. ప్రతి నెలలో సుమారు 10 నుంచి 15 వరకు దొంగ త నాల కేసులు నమోదు అవుతాయి. వీటిని నియంత్రించడంలోనే పోలీసులు విఫలమవుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడమెలా! అసాంఘిక కార్యకలాపాలు, సంఘవిద్రోహ చర్యలకు సంబంధించి నివారణ, ముందస్తుగానే నివారించే కార్యక్రమాలు కనీసం అందుబాటులో లేవు. బస్టాండ్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు కలగా మారింది. గతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి నెల రోజులు మాత్రమే సని చేసి మూలకు పడిపోయూరుు. ఆ తరువాత వాటిని ప ట్టించుకునేవారే లేరు. బస్టాండ్‌లో అస లే రద్దీ....అనుమానస్పద వ్యక్తులను గుర్తించడం పోలీసులకు సైతం సా ధ్యంకాని పని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే గుర్తించడం కూడా కష్టతరమైన విషయం. పైగా బస్టాండ్‌లో షాపుల కేటాయింపు ఇష్టా రా జ్యంగా ఉండడంతో ఎక్కడ ఏ వస్తువు ఎవరిది అనేది గుర్తించడానికి వీలులేకుండా పోరుుంది. సైకిల్స్టాండ్లు కూడా బస్టాండ్‌కు అనుకొని ఉంటాయి. బస్టాండ్ ప్రాంతంలోనే వివిధ ప్రాంతాల బస్సులు నిలిపి ఉంచుతారు. విషయం ఏమిటంటే రాత్రి పూట కరెంటు పోతే జనరేటర్ సౌకర్యం కూడా అందుబాటులో లేదు. ప్రయాణికుల ంతా చీకటిలోనే వేచి చూడాల్సిందే. ఆదాయంపైనే దృష్టిసారించిన ఆర్టీసీ అధికారులు రక్షణ చర్యల కోసం మాత్రం ముందుకు రావడం లేదు. 146 దుకాణాలు ఉ న్నారుు. ఇరుకు సందు ఉంటే చాలు అధికారులు టెండర్ ద్వారా వ్యాపారస్తులకు కేటాయిస్తున్నారు. దీంతో బస్టాండ్ రద్దీగా మారిపోయింది. అధికారులు ఇకనైన స్పం దించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయూలని, బస్టాండ్‌లో పోలీసు భద్రతను మరింత పెంచాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. -
అగ్గి రాజుకుంటే బుగ్గే
బహుళ అంతస్తుల్లో భద్రత కరువు ⇒ ‘ఫైర్’ అనుమతి లేకుండా వెలుస్తున్న భవంతులు ⇒ కంటికి కన్పించని ఫైర్ సేఫ్టీ పరికరాలు ⇒ కాసులిస్తే కన్నెత్తి చూడని అగ్నిమాపక అధికారులు సాక్షి, మంచిర్యాల : బహుళ అంతస్తులు నిర్మించారా..? భవంతుల్లో రక్షణ చర్యలు లేవా..? ఫైర్‌సేఫ్టీ పరికరాలూ లేవా..? అయినా.. ఆందోళన వద్దు.. ‘దక్షిణ’ సమర్పించండి చాలు. మీ జోలికి ఎవరూ రారు. పరిస్థితి సీరియస్ అ యినప్పుడే.. నామమాత్రంగా నోటీసులిస్తాం. స్పం దించకున్నా పర్వాలేదు. తర్వాత మళ్లీ ‘మామూలు’ పరిస్థితే...! ఇలా అగ్నిమాపక శాఖాధికారులు వ్యవహరిస్తు న్న ఈ తీరుపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న భవంతులు అగ్నిమాపక శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. రక్షణ చర్యలు చేపట్టాలంటే.. రూ.1.50 లక్ష నుంచి రూ.3 లక్షల పైనే (అంతస్తులను బట్టి) ఖర్చవుతుంది. అదంతా అదన పు ఖర్చని భావించే నిర్వాహకులు క్షేత్రస్థాయిలో అధికారులను మచ్చిక చేసుకుంటున్నారు. అగ్నిమాపక అధికారులకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు దక్షిణ సమర్పించుకుంటున్నారు. అనుకోకుండా ఏదై నా అగ్ని ప్రమాదం జరిగితే.. దాన్ని సాకుగా చూపి తనిఖీల పేరిట మళ్లీ మిగతా భవనాల యజమానుల నుంచి డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మా రింది. ఇటీవల మంచిర్యాల పట్టణంలో ఓ బహుళ అంతస్తులో అగ్ని భద్రత పరికరాలు లేకపోవడంతో సదరు యజమాని అగ్నిమాపక అధికారులకు ‘మాములు’ సమర్పించుకున్నాడు. అంతే కాదూ.. ఇతర ప్రాంతాల నుంచి తనిఖీ అధికారులు రావాలన్నా సదరు బిల్డింగ్ యజమాని రవాణా ఖర్చులూ భరించాల్సిందే. తలొగ్గిన అధికారులు.. జిల్లా కేంద్రంతోపాటు నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి ప్రాంతాల్లో బహుళ అంతస్థులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా బిల్డర్లు.. పారిశ్రామికవేత్తలు.. వైద్యులు ఆగమేఘాల మీద భవనాలు నిర్మించేస్తున్నారు. జిల్లాలో విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు, లాడ్జింగ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు, కల్యాణ మండపాలు వేలాది సంఖ్యలో ఉన్నా అగ్నిమాపక శాఖ అనుమతితో కొనసాగుతున్నవి పదుల సంఖ్యలోనే. భవంతుల్లో ఫైర్‌సేఫ్టీ పరికరాలున్నాయా..? లేవా..? చూసి అనుమతి ఇవ్వాల్సిన అగ్నిమాపక శాఖాధికారులు బిల్డర్లు, వ్యాపారులకు తలొగ్గారు. అనుమతి లేకుండా, కనీస అగ్ని భద్రత (ఫైర్‌సేఫ్టీ) పరికరాలు లేకుండా కొనసాగుతున్న ఆస్పత్రులు, విద్యా సంస్థలు, లాడ్జింగ్‌లపై కన్నెత్తి చూడ్డం లేదు. కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారు. ఈ విషయంలో జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్లింగం స్పందిస్తూ.. భవంతుల్లో రక్షణ చర్యలు చేపట్టని నిర్వాహకులకు కోర్టు నోటీసులు ఇస్తామన్నారు. కానరాని రక్షణ చర్యలు..! అగ్ని ప్రమాదం జరిగితే.. ఫైరింజన్ సంఘటనా స్థలం వెలుపలికి వెళ్లి మంటలార్పే విధంగా ద్వారం ఉండాలి. కనీసం భవంతి చుట్టూ వాహనం సునాయసంగా తిరిగే స్థలం ఉండాలి. గ్రౌండ్ ఫ్లోర్, ఆ పై అంతస్తులు (జి+) కలిగి ఉంటే ఇసుక, నీళ్ల బకెట్లు.. ఫైర్ ఎక్స్టెన్షన్స్.. డ్రై కెమికల్ పౌడర్ ఏర్పాటు చేసుకోవాలి. సినిమా థియేటర్లు.. లాడ్జీలు.. కల్యాణ మండపాలు.. గిడ్డంగులు.. ఆస్పత్రులు.. విద్యాసంస్థల్లో డౌన్ కామర్, ఓబీ రీల్, హైజెంట్ సిస్టమ్స్ కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. అనుమతి పొందిన తర్వాత ప్రతి ఏడాదికి సర్టిఫికెట్ రెన్యూవల్ చేసుకోవాలి. విద్యాసంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్‌హాళ్లు, లాడ్జీలు, ఆస్పత్రులు మీటరుకు రూ.10 చొప్పున రుసుము చెల్లించాలి. సినిమా థియేటర్ల యజమానులైతే ఏడాదికి రూ.10 వేలు చెల్లించి అగ్నిమాపక శాఖతో రెన్యువల్ చేసుకోవాలి. కానీ.. ఇలా అమలుకు నోచుకోవడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం...! జిల్లావ్యాప్తంగా నిర్మిత మైన.. నిర్మితమవుతోన్న భవంతుల విషయంలో ముందుగా అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరి. ఈ శాఖ ఇచ్చిన నో ఆబ్జెక్షన్ (ఎన్వోసి) సర్టిఫికెట్ చూసిన తర్వాతే మున్సిపల్, రెవిన్యూ అధికారులు సమ్మతించాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఇది అమలు కావడం లేదు. అధికారులు తమ అనుమతి లేకుండానే భవన నిర్మాణాలకు అనుమతులిచ్చేస్తున్నారని అగ్నిమాపక శాఖాధికారులు చెబుతున్నారు. -
పాఠశాలలకు భద్రత కరవు
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :ప్రభుత్వ పాఠశాలల్లో విలువైన సామగ్రి, రికార్డులకు భద్రత కొరవడింది. తరచూ కంప్యూటర్లు, ఫర్నిచర్ అపహరణకు గురవుతున్నాయి. రాత్రి వేళ కాపలాదారులు లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పాఠశాలలు నిర్లక్ష్యపు నీడన కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల అభివృద్ధికి రాజీవ్ విద్యామిషన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా ఏటా లక్షలాది రూపాయలు విడుదల చేస్తున్నారు. విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ కల్పించేందుకు ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ (ఐసీటీ) పథకం కింద ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 11 కంప్యూటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రింటర్, జనరేటర్, ఫర్నిచర్, ల్యాబ్‌లో పరికరాలు, రికార్డులు భద్ర పరిచే బీరువాలు ఉన్నాయి. రాత్రి వేళలు, సెలవు దినాల్లో పాఠశాల వైపు కన్నెత్తి చూసే వారు లేకపోవడంతో వాటి భద్రత గాల్లో దీపంలా మారింది. కంప్యూటర్ల అపహరణ కాపలాదారులు లేని కారణంగా ఇటీవల జిల్లాలోని పలు పాఠశాలల్లో కంప్యూటర్లు చోరీకి గురయ్యాయి. యడ్లపాడు మండలంలోని జగ్గాపురం, నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో రాత్రివేళ తలుపులు పగులగొట్టి కంప్యూటర్లు అపహరించారు. మాచర్లలోని పలు పాఠశాలల్లో ఇదే రీతిలో చోరీలు జరిగాయి. మరికొన్ని పాఠశాలలు సెలవుదినాల్లో ప్లేగ్రౌండ్స్‌గా మారిపోతున్నాయి. గుంటూరు నగరంలో చౌత్రాలో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను పరిశీలిస్తే ఇక్కడ కాపలాదారుడు లేకపోవడంతో సెలవురోజుల్లో చుట్టపక్కల ప్రాంతాల్లోని యువకులు మెయిన్‌గేట్ తాళం పగులగొట్టి పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన ఉపాధ్యాయులతో ఘర్షణకు దిగి, తరగతి గదులపై రాళ్లు రువ్వడం, కిటికీల అద్దాలు పగుల గొట్డడం వంట చర్యలకు పాల్పడుతున్నారు. తమకు అడ్డుగా ఉందనే కారణంతో ఏకంగా పాఠశాల గోడకే కన్నం పెట్టగా, అనంతరం కాలంలో ఉపాధ్యాయులు ఆ కన్నం మూసివేశారు. దీనిపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే రోజూ తాము పాఠశాలలో మకాం వేసి ఉండలేమని, సొంతంగా కాపలాదారుడిని నియమించుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. జిల్లా కేంద్రం లోనే ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉం టుందో అర్ధం చేసుకోవచ్చు. పల్నాడు ప్రాంతంలోని పలు పాఠశాలలు రాత్రి వేళల్లో మద్య వ్యసనపరుల, పేకాట రాయుళ్ళకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. ప్రతిపాదనలు బుట్టదాఖలు.. జిల్లా పరిషత్ యాజమాన్యంలో 314, ప్రభుత్వ యాజమాన్యంలో మరో 13 ఉన్నత పాఠశాలలు కొనసాగుతుండగా వీటిలో 28 మినహా మిగిలిన స్కూళ్ళలో కాపలాదారులు లేరు. నాలుగేళ్ల క్రితం అప్పటి జెడ్పీ చైర్పర్సన్ కూచిపూడి అధ్యక్షతన జెడ్పీ ఉన్నత పాఠశాలలకు కాపలాదారులను నియమించాలని తీర్మానం చేసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. కనీసం ఔట్సోర్సింగ్ పద్ధతిలో అయినా కాపలాదారులను నియమించాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం శూన్యం. -
ఏటీఎం కేంద్రాల వద్ద భద్రత కరువు
సాక్షి, ఒంగోలు: ఏటీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. బ్యాంకుల్లో గంటల తరబడి క్యూలో నిలబడే బాధ తప్పడం, ఎక్కడికి వెళ్లాలన్నా డబ్బు వెంట పట్టుకుని ఉంటూ బిక్కుబిక్కుమనే కన్నా అవసరమైనప్పుడు నగదు డ్రా చేసుకునే వసతి ఉంది. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు చూస్తే..బ్యాంకులు ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాయే కానీ వాటి బాగోగులు పట్టించుకోవడం మానేశాయి. ఏటీఎంలు తరచూ రిపేర్లనో, నగదు లేదనో బోర్డు తగిలించి పేరుకు మాత్రమే ఉన్నాయనిపిస్తున్నారు. అనేక చోట్ల ఏటీఎం సెంటర్లకు రక్షణగా నిలిచే సెక్యూరిటీ గార్డులు ఉండటం లేదు. ఏటీఎంలపై పోలీస్ నిఘా కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. దీంతో ఏటీఎంల వద్ద భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ విషయమై ‘న్యూస్‌లైన్’ బుధవారం జిల్లావ్యాప్తంగా జరిపిన విజిట్‌లో అనేక చోట్ల ఏటీఎం సెంటర్ల వద్ద సెక్యూరిటీ గార్డులు లేని దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్ జరిపే పోలీసులు ఏటీఎంలకు షట్టర్లు మూసి ఉంటే ప్రత్యేకంగా వాటి వద్దకెళ్లి పరిశీలించి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధానం అనేక చోట్ల అమలు కావడం లేదు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు సంబంధించి 380 శాఖలకు గాను 180 ఏటీఎం సెంటర్లున్నాయి. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు ప్రతి శాఖకు ఒక ఏటీఎంను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఏటీఎంలు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాల కోసం అన్వేషణ, సెక్యూరిటీ విషయంలో కొన్ని బ్యాంకు శాఖలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. అన్ని బ్యాంకులు తమ ఏటీఎంల వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసినప్పటికీ పలువురు అవకతవకలకు పాల్పడుతుండటంతో అలాంటి వారిని తొలగించినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం అనేక ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరు. అన్ని ఏటీఎంలలో సీసీ కెమెరాల సౌకర్యం ఏర్పాటు చేసినా వాటికి సంబంధించిన ఫుటేజ్‌లు కేవలం ఆరు నెలల వరకు మాత్రమే సక్రమంగా ఇమేజ్‌లు కనిపించే అవకాశం ఉంది. ఒంగోలులో... ఒంగోలు నగరంలో మొత్తం 58 బ్యాంకు శాఖలకు సంబంధించి 20 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. నగరంలోని నెల్లూరు బస్టాండ్‌లో ఉన్న కార్పొరేషన్, కెనరా, సిండికేట్ బ్యాంకుల వద్ద, సంతపేటలోని ఎస్బీహెచ్ వద్ద, వీఐపీ రోడ్డులోని ఎస్బీఐ, కొణిజేడు బస్టాండ్ వద్ద గల కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరు. అద్దంకిలో.. కొరిశపాడు మండలంలో మేదరమెట్ల, రావినూతల, పమిడిపాడుల్లో ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. మండలంలో ఉన్న ఏటీఎంలలో ఏఒక్క సెంటరుకూ సెక్యూరిటీ లేదు. అద్దంకి లోని ఏటీఎంలలో బంగ్లారోడ్లలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటరు వద్ద ఎలాంటి సెక్యూరిటీ ని ఏర్పాటు చేయలేదు. పంగులూరు మండలంలో ఉన్న ఒక్క ఏటీఎంలో సహితం సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు. చీరాలలో... చీరాల పట్టణంలో అనేక బ్యాంకు శాఖలకు చెందిన ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డుల్లేరు. ఎస్బీహెచ్ బ్యాంకు పక్కన, ఎంజీసీ మార్కెట్ వద్ద ఉన్న ఏటీఎంలకు సెక్యూరిటీగార్డులు లేరు. అలానే హైస్కూల్ రోడ్డులోని ఐఓబీకు కూడా సెక్యూరిటీ గార్డు లేరు. దర్శిలో... ఓరియంటల్, సిండికేట్, పొదిలి రోడ్డులోని ఎస్బీఐ కౌంటర్లు మాత్రమే పనిచేస్తున్నప్పటికీ అక్కడ సెక్యూరిటీ గార్డుల్లేరు. దర్శి ప్రాంతం నుంచి అనేక ఆర్టీసీ సర్వీసులు హైదరాబాద్ వైపు రాత్రి వేళ ఉన్నాయి. పలువురు ప్రయాణిలు ఈ ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద రక్షణ లేక పోవడంతో ఏటీఎం కార్డుదారులు వెళ్లటానికి భయపడుతున్నారు. కొండపిలో... కొండపి భారతీయస్టేట్ బ్యాంకు పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎంకు, టంగుటూరులోని ఒంగోలు వెళ్లే రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఎస్బీహెచ్ ఏటీఎం, కొండపి రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎం, శింగరాయకొండ ట్రంకురోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం, ప్రశాంతి థియేటర్ ఎదురుబజార్లో కెనరాబ్యాంకు ఏటీఎం, సోమరాజుపల్లి పంచాయతీలో ఉన్న ఆంధ్రాబ్యాంకు వద్ద శింగరాయకొండలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న సిండికేట్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుల్లేరు. పొన్నలూరులో ఉన్న స్టేట్‌బ్యాంకు ఏటీఎం వద్ద అదే విధంగా మండలంలోని అగ్రహరంలో ఉన్న ఆంధ్రాబ్యాంకు ఏటియం వద్ద సైతం సెక్యూరిటి గార్డులను ఏర్పాటు చేయలేదు. మార్కాపురంలో.. మార్కాపురంలో 10 ఏటీఎం సెంటర్లు, తర్లుపాడులో 1, పొదిలిలో 3, కొనకనమిట్లలో 1చొప్పున కేంద్రాలు ఉండగా, వీటిలో పలు చోట్ల సెక్యూరిటీ సిబ్బంది లేరు. ఆంధ్రాబ్యాంక్, కరూర్ వైశ్యాబ్యాంక్ మినహా ఇతర బ్యాంక్‌ల్లో సెక్యూరిటీ గార్డులు లేరు. పర్చూరులో.. పర్చూరులో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డుల్లేరు. గన్నవరం సర్కిల్లో ఉన్న ఏటీఎం కేంద్రం సక్రమంగా పనిచేయకపోగా ఎలాంటి సెక్యూరిటీ లేదని జనం పేర్కొంటున్నారు. కారంచేడులో ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి సెక్యూరిటీ లేదు. చినగంజాంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో ఉన్న ఏటీఎం కేంద్రానికి, సినిమాహాలు సెంటరులో ఉన్న ఏటీఎం కేంద్రానికి సెక్యూరిటీ సిబ్బంది లేరు. సంతనూతలపాడులో... పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న యాక్సిస్‌బ్యాంక్‌కు చెందిన ఏటీఎం కౌంటర్లో, రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్లో సెక్యూరిటీ గార్డులేడు.