తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే టీ రామారావు కొన్ని మీడియా వర్గాలు దష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే టీ రామారావు కొన్ని మీడియా వర్గాలు దష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటంబ సర్వేపై ఎలాంటి అపోహాలొద్దని కేటీఆర్ సూచించారు. స్థానికతకు, సర్వేకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు స్థానికత, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర విషయాలపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకుముందు చైనాకు చెందిన విద్యుత్ ఉత్పత్తి యంత్రాల తయారీ పరిశ్రమ ప్రతినిధులు కేసీఆర్తో భేటీ అయ్యారు.