రోడ్డు భద్రత పట్టేదెవరికి..! | No Traffic Rules, No Measurements For Safety | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 27 2018 7:35 AM | Last Updated on Thu, Aug 30 2018 5:35 PM

No Traffic Rules, No Measurements For Safety - Sakshi

స్నేహమంటే ఇదేరా..! తనతో పాటు తప్పక తీసుకెళ్తాడు ‘ఎక్కడికైనా’..!!

అతివేగం అనర్థదాయకం.. ఓవర్‌ లోడ్‌ ప్రమాదకరం.. ఇవి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగాఅధికారులు పలికే నినాదాలు. కేవలం వారోత్సవాల్లో తప్ప ఆచరణలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారుల కంటికి మాత్రం కన్పించడం లేదు.  వారోత్సవాల్లో నినాదాలివ్వడమే కాదు.. ఏడాది మొత్తం నిబంధనలపై నిఘా వేయాల్సిన అవసరం ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని చూసీ చూడనట్లు విడిచిపెట్టకుండా అధికారులు కఠినంగా  వ్యవహరిస్తే ఇలా ప్రయాణించేవారు ప్రమాదాల బారిన పడకుండా కాపాడిన వారవుతారు. అంతేకాక రోడ్డు భద్రత అందరి బాధ్యత అనేది అధికారులు గుర్తించాల్సిన అంశం. ఇటీవల ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన కొన్ని ప్రమాదకర ప్రయాణ దృశ్యాలు.
ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

దారి తెలియని డ్రైవింగ్‌.. ఏ ప్రమాదానికి దారి తీస్తుందో..!

2
2/5

పెద్దాయనా..! పట్టు సడలిందా..రాత మారుద్ది జాగ‍్రత్త..!

3
3/5

ఇది ప్రయాణమా.. ప్రమాదానికి ఆహ్వానమా..!

4
4/5

ఇలాంటివి రోడ్డెక్కితే.. ప్రమాదాలకు కొదవేముంది..!!

5
5/5

యువకుల ఆటో సర్కస్‌.. ప్రమాదపు అంచున ‘నిలబడి’ ప్రయాణం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement