heavy load
-
బాప్రే! ఎత్తు ఎక్కాలంటే.. రిస్క్ చేయాలంతే!
-
కారుపై పడ్డ కంటైనర్: నలుగురు దుర్మరణం
జైపూర్: రాజస్థాన్ పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.పాలరాతి లోడ్‌తో వెళుతున్న కంటైనర్ కారుపై పడడంతో కారు మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. గుడా ఆండ్లా పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని బాలరాయ్ సమీపంలోని హైవేపై శుక్రవారం ఉదయం ఈ విషాదంచోటు చేసుకుంది. (ఘోర రైలు ప్రమాదం: 36 మంది మృతి) స్థానికులసమాచారం ప్రకారం పాలీ నుంచి సిరోహి వైపు వెళ్తున్న కారుపై పాలరాయి లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ పడింది. ట్యాంకర్‌ను క్రేన్ సహాయంతో వేరు చేశారు. దీంతో కారులో ఉన్న దంపతులతో సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని అజ్మీర్ మెడికల్ కాలేజీకి ఆర్థిక సలహాదారుగా మనోజ్ కుమార్ శర్మగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టంమీద మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గుండోజ్‌లోని ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటు విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రావత్, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
రోడ్డు భద్రత పట్టేదెవరికి..!
అతివేగం అనర్థదాయకం.. ఓవర్ లోడ్ ప్రమాదకరం.. ఇవి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగాఅధికారులు పలికే నినాదాలు. కేవలం వారోత్సవాల్లో తప్ప ఆచరణలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారుల కంటికి మాత్రం కన్పించడం లేదు. వారోత్సవాల్లో నినాదాలివ్వడమే కాదు.. ఏడాది మొత్తం నిబంధనలపై నిఘా వేయాల్సిన అవసరం ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని చూసీ చూడనట్లు విడిచిపెట్టకుండా అధికారులు కఠినంగా వ్యవహరిస్తే ఇలా ప్రయాణించేవారు ప్రమాదాల బారిన పడకుండా కాపాడిన వారవుతారు. అంతేకాక రోడ్డు భద్రత అందరి బాధ్యత అనేది అధికారులు గుర్తించాల్సిన అంశం. ఇటీవల ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన కొన్ని ప్రమాదకర ప్రయాణ దృశ్యాలు. – ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం -
ఇదేమి బరువురా బాబోయ్!
బీజింగ్: చైనా అనగానే మనకు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమని గుర్తుకు వస్తుంది. అంతంత మాత్రపు జీతాలపై బతుకు బండి లాగించే కార్మికులు గుర్తొస్తారు. అత్యంత బరువు బండి లాగే బతుకులు కూడా వాళ్లవే. ఒక సైకిల్‌పై నలుగురు, ఒక మోటార్ సైకిల్‌పై ఐదుగురు ప్రయాణించడం అక్కడ నిత్యం కన్పించే దృశ్యాలే. ట్రక్కులపై తీసుకెళ్లాల్సిన సరకులను సైకిల్‌పై లాక్కుపోవడం. వరుసగా మోటారు సైకిల్‌కు ఐదారు వాహనాలను కట్టుకొని తరలించుకుపోవడం, టన్నులకొద్ది బరువుగల భారీ పైపులను రిక్షాలపై లాగించడం, 20 టన్నులకు మించని లోడ్‌ను తీసుకెళ్లాల్సిన వాహనాలపై వంద టన్నుల సరకులను తరలించడం కూడా మామూలే. చైనాలో దాదాపు 66 లక్షల వంతెనలు ఉన్నాయన్నది ఓ అంచనా. వాటిలో దాదాపు పావు వంతు వంతెనలు అధిక బరువును తీసుకెళ్లే ట్రక్కుల వల్లనే కూలిపోయాయట. హాంగ్జౌలోని క్వియాన్టాంగ్ నదిపై నిర్మించిన వంతెన కూడా అలాగే కూలింది. ఆ వంతెన సామర్థ్యం ప్రకారం 30 టన్నులకు మించి సరకులను తీసుకెళ్లరాదు. ఓ రోజు 129 టన్నుల బరవును తీసుకెళుతున్న ట్రక్కు వల్ల కూలిపోయిందట. 2004లోనే రోడ్డు భద్రతా నిబంధనలను తీసుకొచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదట. అందుకే కూలిన వంతెనల చోట కొత్త వంతెనలను కడుతూ పోతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అతి పొడవైన, బలమైన, అబ్బురపరచే వంతెనలు కడుతున్న చైనాకు ఈ దుస్థితి ఏమిటో మరి!