‘పుర’ ఎన్నికలకు నామినేషన్లు షురూ
ముహూర్తాల కోసం అభ్యర్థు ఎదురుచూపు
బుధ, శుక్రవారాల్లో పెరిగే అవకాశం
సాక్షి, కరీంనగర్ :
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. తొలిరోజైన సోమవారం 31 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలకు 31 మంది నామినేషన్లు వేశారు. వీటిలో కాంగ్రెస్ నుంచి ఏడు, టీఆర్‌ఎస్ నుంచి ఏడు, టీడీపీ, గుర్తింపు పొందిన ఇతర పార్టీల నుంచి ముగ్గురు, స్వతంత్రులు 11 మంది నామినేషన్ వేశారు. జగిత్యాల, మెట్‌పల్లి మున్సిపాలిటీకి, పెద్దపల్లి, జమ్మికుంట నగర పంచాయతీకి ఒక్కరూ దాఖలు చేయలేదు.
కరీంనగర్ కార్పొరేషన్‌కు కాంగ్రెస్ తరఫున ఒకరు, టీఆర్‌ఎస్ నుంచి ఆరుగురు, టీడీపీ నుంచి ఒకరు, గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు నామినేషన్ వేశారు. రామగుండం కార్పొరేషన్‌కు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. 11వ డివిజన్ నుంచి టీడీపీ తరఫున నగునూరి రాజయ్య రెండు సెట్లు, మరో నలుగురు స్వతంత్రులు నామినేషన్ వేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీకి ఎనిమిదో వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున ఒక్కటి, కోరుట్ల మున్సిపాలిటికీ టీఆర్‌ఎస్ నుంచి ఒక్కటి, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులిద్దరు చొప్పున నామినేషన్ వేశారు. వేములవాడ నగర పంచాయతీలో ముగ్గురు స్వతంత్రులు నామినేషన్ వేశారు. హుస్నాబాద్‌లో కాంగ్రెస్ తరఫున ముగ్గురు నామినేషన్లు వేశారు.
ముహూర్తాల కోసం ఎదురుచూపు..!
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది గ్రహబలాన్ని చూపించుకున్నారు. ఈనెల 12, 14 తేదీల్లో మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజుల్లోనే నామినేషన్లు సమర్పించాలని చాలామంది నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 13 వరకు నగరపాలక సంస్థలకు, మున్సిపల్, నగర పంచాయతీలకు 14 వరకు గడువు ఉండడంతో ఆఖరిరోజే భారీగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
తొలిరోజు 31 నామినేషన్లు
నగర పాలక సంస్థ
కరీంనగర్ 12
రామగుండం 06
మున్సిపాలిటీలు..
కోరుట్ల 05
సిరిసిల్ల 01
మెట్‌పల్లి 0
జగిత్యాల 0
నగర పంచాయతీ
హుస్నాబాద్ 03
హుజూరాబాద్ 01
వేములవాడ 03
పెద్దపల్లి 0
జమ్మికుంట 0
బోణీ కొట్టారు
Published Tue, Mar 11 2014 4:46 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement