టార్గెట్ చైర్‌పర్సన్
టార్గెట్ చైర్‌పర్సన్
Published Fri, Jun 30 2017 10:44 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
– రెచ్చగొట్టి..కేసులు పెట్టే యత్నం
– కౌన్సిల్ మీట్‌ను ముగించిన చైర్‌పర్సన్
నంద్యాల: దివంగత మాజీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిపై కేసులు పెట్టినందుకు ప్రతీకారంగా చైర్‌పర్సన్ దేశం సులోచన, ఆమె భర్త, కో ఆప్షన్ సభ్యుడు సుధాకర్‌రెడ్డిలను టీడీపీ టార్గెట్ చేసింది. వీరిద్దరూ టీడీపీని వీడి, వైఎస్‌ఆర్‌సీపీలో చేరడంతో ప్రతీకారానికి వ్యూహం రచించారు. శుక్రవారం జరిగిన కౌన్సిల్ మీట్‌లో వీరిని రెచ్చగొట్టి, తర్వాత కేసులు పెట్టడానికి విఫలయత్నం చేశారు. అయితే వీరి పథకాన్ని పసిగట్టిన చైర్‌పర్సన్ దేశం సులోచన కౌన్సిల్ మీట్‌ను ముగించారు.
పథకం ఇలా..
అజెండాలో కేవలం 8 నామమాత్రపు అంశాలు మాత్రమే ఉండటంతో కౌన్సిల్ మీట్ 15నిమిషాల్లో ముగియాల్సి ఉంది. అయితే అధికార పార్టీ కౌన్సిలర్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన నిధులకు సంబంధించిన పనులను కౌన్సిల్ మీట్‌లో ఎందుకు తీసుకొని రాలేదని ప్రశ్నించి వివాదానికి తెరలేపారు. తర్వాత పలు అంశాలపై వాగ్వాదం జరిగింది. కో ఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్ మాట్లాడుతుండగా, టీడీపీ కౌన్సిలర్ శివశంకర్ అడ్డుతగిలి మాట్లాడే అవకాశం లేదన్నారు. టీడీపీ కౌన్సిలర్లు వివాదాన్ని తీవ్ర చేస్తుండటంతో అజెండా ముగియడంతో చైర్‌పర్సన్ దేశం సులోచన సమావేశాన్ని ముగించి వెళ్లారు. చైర్‌పర్సన్ దేశం సులోచన, సుధాకర్‌రెడ్డిని రెచ్చగొట్టి.. దళిత కౌన్సిలర్లతో ఫిర్యాదులు అందజేసి కేసులు నమోదు చేయించాలనే ప్రయత్నం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement