సాక్షి, హైదరాబాద్: పన్ను ఎగవేతకు పాల్పడుతున్న బడాబాబులపై హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ దృష్టి సారించింది. గత మూడు, నాలుగేళ్లుగా పన్ను బకాయి పడ్డ వారికి నోటీసు లు జారీ చేసి వారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు రూ.47 కోట్ల మేర పన్ను బకాయిలు రాబట్టామని కమిషనరేట్ అధికారులు చెబుతున్నారు. అందు లో పెద్ద పెద్ద ఇన్‌ఫ్రా కంపెనీలున్నాయని, బడా నిర్మాతలు కూడా ఉన్నారని తెలిపారు. జీఎస్టీ పరిధిలో డీలర్‌గా రిజిస్టర్ అయి ఇప్పటివరకు పన్ను రిటర్నులు దాఖలు చేయని 23వేల మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు.
వారం రోజుల క్రితం ఈ నోటీసులు జారీ చేయగా, ఇప్పటికే 1,200 మంది రిటర్నులు దాఖలు చేశారని, ఒక్క బేగంబజార్ డివిజన్ నుంచే రూ.80 లక్షల పన్ను వసూలయిందని వారు చెప్పారు. ఈ నోటీసులందుకున్న వారిలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు చెందిన ఓ బంగారు దుకాణం కూడా ఉందని సమాచారం. జాతీయ స్థాయిలో మంచి పేరున్న జ్యుయెల్లరీ బ్రాండ్‌కు ఫ్రాంచైజీగా ఉన్న ఆ దుకా ణం పన్ను రిటర్నులు దాఖలు చేయకపోవడంతో నోటీసులిచ్చారు. రూ. కోటి వరకు పన్ను చెల్లించాలని గుర్తించి ఏవీ(2) నివేదిక ప్రకారం కేసు కూడా నమోదు చేశారు.
సిగరెట్ల పన్ను ఎగవేత...
తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ జీఎస్టీ కమిషరేట్ అధికారులు ఓ అంతర్రాష్ట్ర సిగరెట్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. పట్నా నుంచి హైదరాబాద్ మీదుగా కర్ణాటకకు పన్ను కట్టకుండా తరలిస్తున్న ఓ సిగరెట్ లోడ్‌ను బుధవారం పట్టుకున్నారు. మొత్తం రూ.24 లక్షల విలువ చేసే 3 లక్షల సిగరెట్లను పట్టుకున్నారు. గోల్డ్‌స్టెప్ టుబాకో ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్యారిస్ బ్రాండ్ మీద సిగరెట్లు తయారుచేసి ఒక్క రూపాయికే అమ్ముతున్నట్లు గుర్తించారు. పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రత్యే క చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
బడాబాబులపై ‘జీఎస్టీ’ నజర్
Published Thu, Mar 15 2018 3:05 AM | Last Updated on Thu, Mar 15 2018 3:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment