
సాక్షి, హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో బార్ కౌన్సిల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు తెలంగాణ, ఏపీలో వేర్వేరుగా బార్ కౌన్సిల్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం బార్ కౌన్సిల్‌కు ఎన్నిక జరగడం ఇదే తొలిసారి.
జూన్ 29 న ఎన్నిక జరుగనుండగా.. ఈ నెల 17 నుంచి 26 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రెండు రాష్ర్టాల్లోనూ 52 వేల మందికి ఓటు హక్కు ఉండగా, తెలంగాణలో 23 వేల మంది, ఏపీలో 29 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో రాష్ట్రంలో బార్ కౌన్సిల్‌కు 25 మంది చొప్పున ఎన్నికవుతారు.
Comments
Please login to add a commentAdd a comment