
హైదరాబాద్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇంటిని చూసి టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముగ్ధుడైపోయారు. ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లోని మంచు కప్పిన తన ఇంటిని ఫొటో తీసి బుధవారం ట్విట్టర్‌లో పెట్టారు. అయితే ఈ ఫొటోను చూసిన కేటీఆర్..శ్రీనగర్‌లో తనకు ఓ ఇల్లు ఉంటే బాగుండేదని ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన ఒమర్ అబ్దుల్లా...‘ఈ ఇంటికి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావొచ్చ’ని బదులిచ్చారు. దీనికి కేటీఆర్..‘‘కోరికలు తీర్చే యంత్రమేదైనా ఉంటే మాత్రం కచ్చితంగా అక్కడ ఇల్లు ఉండాలని కోరుకుంటాను’’అని సమాధానమిచ్చారు. దీనికి మళ్లీ స్పందించిన ఒమర్ అబ్దుల్లా...నన్ను నీవాడిగా భావించి ఇక్కడ ఉండాల్సిందిగా కోరుతున్నాను’’అన్నారు. దీనికి మళ్లీ కేటీఆర్...ఒమర్ సాబ్..మీరు ఇచ్చే ఈ ఆఫర్‌ను సీరియస్‌గానే తీసుకుంటున్నాను’’అని బదులిచ్చారు.