
గరుడ బస్సు బోల్తా: ఎస్పీ మృతి!
నల్గొండ : ఆర్టీసీ గరుడ బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో తొమ్మిదిమంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా మునగాల మండలం తాడ్వాయి వద్ద జరిగింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెలను తప్పించబోయి బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విజయవాడ కమ్యూనికేషన్స్ ఎస్పీ దుర్మరం చెందినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.