
సాక్షి, హైదరాబాద్: డిస్పెన్సరీల్లోనే మందులు అందుబాటులో ఉంచేలా ఆర్టీసీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగా డిస్పెన్సరీల్లోనే మందులు అందుబాటులో ఉంచేలా, ఒకవేళ డిస్పె న్సరీకి చేరువలో సంబంధిత సంస్థ మెడికల్ షాపు ఉంటే అక్కడ ఇచ్చేలా ఆర్టీసీ ఎండీ రమణారావు ఆదేశాలు జారీ చేశారు. మందుల సరఫరాను ప్రైవేటు సంస్థకు అప్పగిం చడంతో డిస్పెన్సరీల్లో కాకుండా తమ సొంత మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసేలా ఆ సంస్థ ఏర్పాట్లు చేసింది.
మందుల కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో అనారోగ్యంతో ఉన్న సిబ్బందికి ఇబ్బంది ఎక్కువైంది. దీనిపై ‘చికిత్స ఓ చోట.. మందులో చోట’ శీర్షికతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన ఆర్టీసీ ఎండీ సంబంధిత అధికారులతో సమావేశమై దిద్దుబాటు చర్యలకు ఆదేశాలిచ్చారు. ‘ఆర్టీసీ యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకున్నా కార్మికులకు అనుకూలంగా ఉండాలి. అనారోగ్యంతో డిస్పెన్సరీకి వచ్చే కార్మికులు మందుల కోసం మరో ప్రాంతానికి వెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి నిర్ణయాలు ఎప్పుడూ మేం అమలుచేయం. ఎక్క డైనా ఆ తరహా పరిస్థితి ఉంటే చక్కదిద్దుతాం. ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో ఫార్మసీని ప్రైవేట్‌కు అప్పగించాక మందుల కొరత సమస్య తీరింది’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment