ఓయూ పరిధిలో మే 11 నుంచి పీజీ రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ సుధాకర్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ : ఓయూ పరిధిలో మే 11 నుంచి పీజీ రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఏప్రిల్ 17 వరకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో ఏప్రిల్ 24 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలు ఓయూ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.