పాకిస్తాన్ క్రికెట్ టీమ్.. కాంగ్రెస్ టీమ్ ఒక్కటే : కేటీఆర్
సభలో ఏదీ నియమనిబంధనల ప్రకారం జరగడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క విమర్శించగా.. ఈ వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎల్పీ నేత జానారెడ్డి సూచనలను కాంగ్రెస్ సభ్యులు పాటించడం లేదని, పార్టీలోని అంతర్గత విభేదాలు సభలో బయటపడ్డాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
గతంలో పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఒక కెప్టెన్ ఉంటే 10 మంది మాజీ కెప్టెన్‌లు ఉండేవారని, ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీరు సైతం అలానే తయారైందని ఎద్దేవా చేశారు. దీనిపై ఉత్తమ్ కుమార్‌రెడ్డి దీటుగా స్పందించారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఉం దని, టీఆర్‌ఎస్‌లో కుటుంబ పాలన ఉందని విమర్శించారు. అధికార, విపక్షాల వాదోపవాదాల మధ్య స్పీకర్ మధుసూదనాచారి ఈ సుదీర్ఘ రచ్చకు తెరదీస్తూ సభను మధ్యాహ్న భోజన విరామం కోసం వాయిదా వేశారు.