తెలంగాణ ప్రభుత్వం పాలీహౌస్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పాలీహౌస్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గుజరాత్‌లో జరుగుతోన్న ‘గుజరాత్ వైబ్రంట్’ ఎక్స్‌పోలో ఆయన సోమవారం వ్యవసాయ రంగంపై మాట్లాడారు. ఆ విశేషాలను మంత్రి ‘సాక్షి’కి తెలిపారు. వ్యవసాయం, సూక్ష్మసేద్యం, తుంపర్ల సేద్యం, పాలీహౌస్ తదితర అంశాలపై చర్చ జరిగినట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో 75 శాతం సబ్సిడీతో పాలీహౌస్ ప్రాజెక్టును చేపడుతుందన్నారు. దీనికి రూ. 250 కోట్లు కేటాయించామన్నారు. సూక్ష్మసేద్యం చేపట్టే ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులతో చర్చలు జరిపారు.