పార్లమెంటరీ కార్యదర్శిగా కిషోర్
తిరుమలగిరి : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ను పార్లమెంటరీ కార్యదర్శిగా పదవి వరిం చింది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా గాదరి కిషోర్ గుర్తింపు పొందారు. టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తూనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థి నాయకులకు టికెట్ ఇవ్వాలని సంకల్పించి కిషోర్‌కు తుంగతుర్తి నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించారు. కేసీఆర్ అంచనాలకనుగుణంగా విజయఢంకా మోగించారు. అతి చిన్నవయస్సులో ఎమ్మెల్యేగా గెలిచారు. అనతికాలంలోనే పార్లమెంటరీ పదవి వరించడంతో స్థానిక నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.అయితే కిషోర్‌కు ఆరోగ్యశాఖ కేటాయించారు.
జిల్లాకు నాలుగు పదవులు..
కేసీఆర్ కేబినెట్‌లోకి తొలివిడతతోనే జిల్లాకు బెర్త్ దక్కింది. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని విద్యాశాఖ వరించింది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన మునుగోడుకు చెందిన కర్నె ప్రభాకర్‌కు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ప్రభాకర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. ఆపై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు విప్‌గా అవకాశం దక్కింది. తాజాగా కిషోర్‌ను పార్లమెంటరీ సెక్రటరీ పదవి వరించింది.