మందులోళ్లే.. మాయలోళ్లు!  | Passwords are stolen and indent to drugs | Sakshi
Sakshi News home page

మందులోళ్లే.. మాయలోళ్లు! 

Published Tue, Apr 30 2019 12:14 AM | Last Updated on Tue, Apr 30 2019 12:14 AM

Passwords are stolen and indent to drugs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇది మందులోళ్ల మాయాజాలం.. మందుల కొను‘గోల్‌మాల్‌’.. కమీషన్ల కహానీ. కాసుల కక్కుర్తి.. ఇదీ సర్కార్‌ ఆసుపత్రుల్లో సాగుతున్న తతంగం. ప్రభుత్వాసుపత్రిలో అవసరమున్నా లేకపోయినా ఇష్టారాజ్యంగా మందులకు ఇండెంట్లు పెట్టడం, తద్వారా కంపెనీల నుంచి కమీషన్లు పొం దడం వైద్య, ఆరోగ్య శాఖలోని కొందరు అధికారులకు, ఫార్మసిస్టులకు అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో జరిగిందే నాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఘటన. ఈ కేంద్రానికి 500 ట్రెమడాల్‌ మాత్రలు అవసరంకాగా, ఏకంగా 10 వేల మాత్రలు పంపించారు. ఆ మాత్రల వల్లే ఇటీవల ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తేలిందేంటంటే, ఆసుపత్రి ప్రధానాధికారి వద్ద మం దుల ఇండెంట్‌ పెట్టేందుకుగాను ఆన్‌లైన్‌కు సంబం ధించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను కొందరు ఫార్మసిస్టులు దొంగిలించి ఇండెంట్లు పెట్టడం. ఈ వ్యవహా రం ఆ శాఖలో సంచలనంగా మారింది. దీంతో సద రు ఫార్మసిస్టులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది.  

కింది నుంచి పైస్థాయి వరకు కమీషన్ల కక్కుర్తి 
మందుల కొనుగోలుకు సంబంధించి ప్రతి ఆస్పత్రికి ఒక యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కేటాయిస్తారు. అది ఆసుపత్రి ప్రధానాధికారికి మాత్రమే తెలుస్తుంది. గతంలో పీహెచ్‌సీల్లోని మెడికల్‌ ఆఫీసర్‌ మందులకు ఇండెంట్‌ పెడితే అది జిల్లా వైద్యాధికారికి చేరేది. అక్కడి నుంచి ప్రజారోగ్య సంచాలకులకు అవి చేరేవి. బోధనాసుపత్రులైతే వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ)కు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని ఆసుపత్రులైతే సంబంధిత కమిషనర్‌కు చేరేవి. ఈ ముగ్గురు తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)కు ఇండెంట్‌ పెట్టేవారు. వారికి కేటాయించిన బడ్జెట్‌ ఆధారంగా మందుల సరఫరా జరిగేది. దీని స్థానంలో ఆన్‌లైన్‌ విధానం తీసుకువచ్చారు. దీంతో ఏ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి మందులు కావాలన్నా నేరుగా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి ఇండెంట్‌ పెడుతున్నారు. అయితే, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి మందుల సరఫరా చేసే కంపెనీలతో ఫార్మసిస్టులు, డాక్టర్లు కుమ్మక్కు అవుతున్నారన్న ఆరోపణలున్నాయి. అవసరం లేకపోయినా ఫలానా మందు లు కావాలని ఇండెంట్‌ పెడుతున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా ఫార్మసిస్టులే ఆసుపత్రి ప్రధానాధికారి వద్ద ఉండే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను సేకరించి టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి నేరుగా మందుల ఇండెంట్‌ పెడుతున్నారు. ఆ మందులను వాడకపోతే ఎందుకు తెప్పించారో సర్కారుకు సమాధానం చెప్పాల్సి ఉం టుంది. అందుకే తెప్పించిన మందులను గడువుకు కొద్దినెలలు ముందుగా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి వెనక్కు పంపిస్తున్నారు. అక్కడి నుంచి మళ్లీ ఏవో కొన్ని పీహెచ్‌సీలకు అవి వెళ్తుంటాయి. 

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో.. 
వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఇద్దరు ఫార్మసిస్టులు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను తస్కరించి టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి భారీగా మందుల కొనుగోలు ఇండెంట్‌ పెట్టారు. విషయాన్ని గ్రహించిన ఎంజీఎం వైద్యాధికారులు అంతర్గతంగా విచారణ జరిపారు. ఫార్మసిస్టులు అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి ఒక నివేది కను డీఎంఈకి పంపారు. దాని ఆధారంగా ఆ ఫార్మ సిస్టులను సస్పెండ్‌ చేయాల్సిందిగా డీఎంఈ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆస్ప త్రులు పెట్టే మందుల ఇండెంట్లను పరిశీలించి, పర్యవేక్షించేందుకు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో ఒక వ్యవస్థ ఉం టుంది. ఆ అధికారులు ఇండెంట్లను పర్యవేక్షించాలి. కానీ వారు కూడా కంపెనీలతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 

Government hospitals
  Pharmacists
Passwords
  Indents
Department of Health

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement