నేడు పీఈసెట్‌ నోటిఫికేషన్‌ | PECET Notification To Be Released Today | Sakshi
Sakshi News home page

నేడు పీఈసెట్‌ నోటిఫికేషన్‌

Feb 26 2018 2:29 AM | Updated on Feb 26 2018 2:30 AM

PECET Notification To Be Released Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న పీఈసెట్‌–2018 నోటిఫికేషన్‌ను సోమవారం జారీ చేయనున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ తెలిపారు. ఆన్‌లైన్‌లో (http://pecet.tsche.ac. in) దరఖాస్తులను ఈ నెల 28 నుంచి స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 10 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 17 వరకు, రూ. 2 వేల రుసుముతో ఏప్రిల్‌ 24 వరకు, రూ. 5 వేల రుసుముతో ఏప్రిల్‌ 30 వరకు దరఖాస్తు సబ్మిట్‌ చేయాలని వెల్లడించారు. మే 7 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ. 400, ఓసీ, బీసీలకు రూ. 800గా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ డీపీఈడీ కాలేజీల్లోని 200 సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 150 సీట్లను, ప్రభుత్వ బీపీఈడీ కాలేజీల్లోని 60 సీట్లు, యూనివర్సిటీల్లో కాలేజీల్లోని 200 సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 1,400 సీట్లను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement