పొలం వద్ద గుడిసెలో నివసిస్తున్న కుటుంబం
సాక్షి, లింగంపేట(నిజాబామాద్) : కరోనా మహమ్మారికి భయపడి ఆ గ్రామస్తులు ఇళ్లను విడిచి పొలాల్లోకి తమ నివాసాలను మార్చారు. అక్కడే గుడిసెలు ఏర్పాటు చేసుకుని 15 రోజులుగా నివసిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. లింగంపేట మండలం కోమట్‌పల్లి గ్రామంలో సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఈ గ్రామస్తులనూ భయాందోళనకు గురిచేసింది. దీంతో తమను తాము కాపాడుకునేందుకు భౌతిక దూరాన్ని పాటించేందుకు కొన్ని కుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. సుమారు 50 కుటుంబాలు ఇల్లు విడిచి పొలాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాయి. పొలం వద్ద గుడిసెలు వేసుకుని 15 రోజులుగా అక్కడే నివసిస్తున్నాయి. వారినికోసారి గ్రామంలోకి వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకుంటున్నామని వారు తెలిపారు. తమకు ప్రకృతే రక్షణ ఇస్తుందని నమ్ముతున్నామని పేర్కొంటున్నారు.(‘చైనా యాప్ టిక్‌టాక్‌ను బహిష్కరించాలి’)
Comments
Please login to add a commentAdd a comment