సాక్షి, హైదరాబాద్ : పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూపీఎస్సీ తరహా నియామక పద్ధతులను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పాటించనుంది. దీనిలో భాగంగా ఫిజికల్ మెజర్‌మెంట్స్, ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్షల తర్వాతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడితే బాగుంటుందన్న నిర్ణయానికి బోర్డు అధికారులు వచ్చినట్లు తెలిసింది. దీనివల్ల మెయిన్స్‌కు వెళ్లే అభ్యర్థుల సంఖ్యపై ముందుగానే స్పష్టత రానుంది. దీంతో కేవలం ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులకే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడితే సరిపోతుందన్న అభిప్రాయానికి బోర్డు వచ్చింది.
ఇప్పటికే ఎస్‌ఐ విభాగంలో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన బోర్డు.. ఇక రెండో దశలో ఫిజికల్ మెజర్‌మెంట్స్, ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్షలు నిర్వహించనుంది. దీనివల్ల సమయం ఆదా కావడంతోపాటు శ్రమ కూడా ఉండదని బోర్డు ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో జరిగిన నియామకాల సందర్భాల్లో ఫిజికల్ టెస్టుల కం టే ముందే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేవారు. కానీ దీనివల్ల లక్షల మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు 10 నుంచి 15 రోజుల సమయం పట్టేది. కొత్త విధానంలో మెయిన్స్ అభ్యర్థుల సర్టిఫికెట్లు మాత్రమే పరిశీలిస్తే సరిపోతుందని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎస్‌ఐ అభ్యర్థులతోపాటు కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా వర్తిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ముందే ఫిజికల్ టెస్టులు
Published Tue, Oct 2 2018 1:23 AM | Last Updated on Tue, Oct 2 2018 1:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment