
ఈ భేటీ తమ వ్యక్తిగతమని ఎమ్మెల్యే అన్నారు.
తాండూరు : తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను కలిశారు. బుధవారం చెన్నైలోని రజినీకాంత్ నివాసానికి ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి, ఆయన సతీమణి ఆర్తిరెడ్డి.. రజినీకాంత్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం రజనీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నుకున్న ప్రజలకు సేవచేయాలని రోహిత్‌రెడ్డికి రజినీ సూచించారని తెలిపారు. ఈ భేటీ తమ వ్యక్తిగతమని అన్నారు. సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు కోట్లలో అభిమానులు ఉన్నారన్నారు.
కాగా, గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన రోహిత్‌రెడ్డి, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. గతంలో కూడా రోహిత్‌రెడ్డి పలుమార్లు రజనీకాంత్‌ను కలిశారు.