పంట బీమాకు ని‘బంధనాలు’! | pocharam sreenivas reddy speech on Crop insurance scheme | Sakshi
Sakshi News home page

పంట బీమాకు ని‘బంధనాలు’!

Published Sun, Dec 18 2016 2:57 AM | Last Updated on Sat, Aug 11 2018 8:58 PM

పంట బీమాకు ని‘బంధనాలు’! - Sakshi

పంట బీమాకు ని‘బంధనాలు’!

పీఎంఎఫ్‌బీవైతో ఆశించిన ప్రయోజనం లేదు: పోచారం
బీజేపీ అభ్యంతరం.. పోచారం క్షమాపణకు డిమాండ్‌


సాక్షి, హైదరాబాద్‌: పాత పంటల బీమా పథకంలో సవా లక్ష నిబంధనలతో రైతులకు ప్రయోజనం కలగలేదని, కేంద్రం కొత్తగా అమల్లోకి తెచ్చిన ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కూడా ఆశించిన ప్రయోజనాన్ని కలిగించలేకపోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పథకం ద్వారా రిలయన్స్, బజాజ్‌ తదితర 16 ప్రైవేటు బీమా కంపెనీలను కేంద్రం ప్రోత్సహించిందన్నారు.

రాష్ట్రంలో పీఎంఎఫ్‌బీవై అమలుపై బీజేపీ సభ్యులు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో లేవనెత్తిన ప్రశ్నలకు పోచారం సమాధానమిచ్చారు. రైతులకు ప్రయోజనం కలిగించేందుకు నిబంధనలను సవరించాలని కేంద్రాన్ని కోరారు. పీఎంఎఫ్‌బీవై లోపాలను పోచారం ఎండగట్టడంపై బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పోచారం క్షమాపణ చెప్పాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement