
కొండా మురళీ వాహనాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు
సాక్షి, మామునూరు/వరంగల్ అర్బన్: రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీఏ జంక్షన్‌లో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ గ్రామాలకు ప్రచార నిమిత్తం వెళ్తున్న ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, క్రికెట్ మాజీ కెప్టన్ ఎండీ అజహారుద్దీన్ ప్రయాణించే వాహనాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనంలో ఎలాంటి అక్రమ తరలింపులు లేకపోవడంతో వాహనాలను వదిలేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాహనాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బు, మద్యం తరలిస్తే చర్యలు తప్పవని చెక్‌పోస్ట్ ఇన్‌చార్జ్ అధికారి శాంతకుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై రమేష్, కానిస్టేబుల్ యాకూబ్‌పాషా, హెడ్ కానిస్టేబుల్ రాకేష్, సాంబయ్య, ఫొటోగ్రాఫర్ శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ వాహనాన్ని తనిఖీ చేస్తున్న చెక్‌పోస్ట్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment