మహిళపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం | Police Head Constable attempt to rape woman in warangal district | Sakshi
Sakshi News home page

మహిళపై హెడ్ కానిస్టేబుల్ అత్యాచారయత్నం

Published Mon, Apr 7 2014 10:09 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Police Head Constable attempt to rape woman in  warangal district

నల్గొండ : ఎన్నికల  విధులకి వెళ్లిన హెడ్‌కానిస్టేబుల్‌ దుర్గారెడ్డి ఓ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం దుగ్గేపల్లిలో జరిగిందీ ఘటన. జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో త్రిపురారం పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ దుగ్గేపల్లిలో పెట్రోలింగ్‌ నిర్వహించాడు. అతనితో పాటు ఆటోడ్రైవర్‌ సైదులును కూడా పెట్రోలింగ్‌కు తీసుకెళ్లాడు.

పెట్రోలింగ్‌ అనంతరం సైదులు ఇంట్లో ఇద్దరూ భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. అర్థరాత్రి సైదులు భార్యపై దుర్గారెడ్డి అత్యాచారం చేయబోయాడు...ఆమె కేకలు వేయడంతో  పరారయ్యాడు. బాధితురాలు, భర్త గ్రామస్తులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు దుర్గారెడ్డిని అదుపులోకి తీసుకుని త్రిపురారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement