సాక్షి,హైదరాబాద్: ‘స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్’ కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా లోగో తయారు చేసింది. అదనపు డీజీపీ రాజీవ్ త్రివేది నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టీఎస్‌ఎస్‌పీ) 1,8 బెటాలియన్లు డీజీ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ ఈ లోగోను ఆవిష్కరించారు.
అనంతరం డీజీపీ కార్యాలయంలో పోలీసు సిబ్బందిని 14 గ్రూపులుగా విభజించి ఆవరణలోని 14 ప్రాంతాల్లో శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ పోలీస్ శాఖ స్వచ్ఛందంగా గత ఆరు రోజుల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమైందన్నారు.
స్వచ్ఛ హైదరాబాద్ పోలీస్ లోగో ఆవిష్కరణ
Published Fri, May 22 2015 2:44 AM | Last Updated on Tue, Aug 21 2018 7:25 PM
Advertisement
Advertisement