నవాబు పేట జడ్పీటీసీ టీఆర్‌ఎస్ కైవసం | Police ranreddi win as ZPTC | Sakshi
Sakshi News home page

నవాబు పేట జడ్పీటీసీ టీఆర్‌ఎస్ కైవసం

Published Tue, Dec 8 2015 5:56 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Police ranreddi win as ZPTC

హోరా హోరీగా సాగిన రంగారెడ్డి జిల్లా నవాబుపేట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పోలీస్ రాంరెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్ధి చిట్టెపు మల్లారెడిపై విజయం సాధించారు. కాగా, టీడీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. ఈ స్థానానికి సోమవారం ఎన్నిక జరగ్గా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఓట్లు లెక్కించారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 10 గంటలకు ముగిసింది. 8 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్యనే పోటీ జరిగింది. మొత్తం ఐదు రౌండ్లలో టీఆర్‌ఎస్ 699 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌పై విజయం సాధించింది. టీడీపీకి అన్ని రౌండ్లలోనూ కలిపి అత్యల్పంగా 641 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 269 ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయినట్లయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement