అభం శుభం తెలియని చిన్నారికి పెళ్లి చేయాలని ప్రయత్నించిన తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం బాబుసాయిపేట లో గురువారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన మైనర్ బాలిక(11)కు జగిత్యాల మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన షేక్ మధార్‌తో వివాహం నిశ్చయమైంది. ఇది గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పెళ్లిని అడ్డుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులను కౌన్సెలింగ్ నిమిత్తం కరీంనగర్ తీసుకెళ్లారు.