రామగుండం : రైలు నుంచి జారి పడి పాలిటెక్నిక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా రామగుండంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మృతుడు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం జండా వెంకటపూర్‌కు చెందిన పవన్‌కుమార్ (17)గా పోలీసులు గుర్తించారు. ఇతడు హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.