
మిషన్ కాకతీయపై చర‍్చకు సిద‍్ధం-పొన‍్నం
సిద్దిపేట: మిషన్ కాకతీయపై బహిరంగ చర్చకు సిద్ధమని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాల పేర్లు ఆకర్షణీయంగా ఉన్నా ఆచరణలో అత్యంత దారుణంగా మారాయన్నారు. అలాగే మిషన్ కాకతీయ అమలులో ప్రభుత్వం చెబుతున్నదానికి, వాస్తవానికి పూడ్చలేని వ్యత్యాసం ఉందన్నారు. చెరువుల పూడికతీత నేతిబీరలో నెయ్యి చందంగా మారిందని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని ఆయన పేర్కొన్నారు.