కాంట్రాక్టర్లు రెండుగా విడిపోరుు దాడులు
ఇరు వర్గాలూ అధికారపార్టీ వారే..
ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు
కొత్తగూడ : కాంట్రాక్టర్లంతా రింగ్ అయి మిషన్ కాకతీయ పనుల్లో ఎక్కువ లాభాలు ఆర్జించాలనే యోచన బెడిసికొట్టి పరస్పర దాడులకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. కొత్తగూడ ఏజెన్సీలో చెరువుల మరమ్మతుకు ప్రభుత్వం ఆన్‌లైన్ టెండర్లను ఆహ్వానించింది. పోటీపడి టెండర్లు వేసి నష్టపోతున్నామని, తక్కువ లెస్‌తో దాఖలు చేస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చని కాంట్రాక్టర్లు గత ఐదు రోజుల పాటు మంతనాలు జరిపి, ఆరుగురు సభ్యులతో రింగ్ కమిటీ వేశారు. అందుకు మండలంలో ఉన్న కాంట్రాక్టర్ల నుంచి రూ. 50 వేల చొప్పున డిపాజిట్‌తో పాటు లెసైన్స్ కీ లు వసూలు చేశారు. ఇలా జమ అరుున రూ.35 లక్షలు జెడ్పిటీసీ సభ్యురాలు అరుణ భర్త దేశిడి శ్రీనివాసరెడ్డి వద్ద, లెసైన్స్ కీ లు టీఆర్‌ఎస్ నాయకుడు, కాంట్రాక్టర్ నాగమల్లేశ్వర్ వద్ద ఉంచారు. అందుకు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను సైతం ఒప్పించారు.
ఆదివారం అర్ధరాత్రి టెండర్లు ఓపెన్ చేయించారు. పనుల కేటాయింపులో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో శ్రీనివాస్‌రెడ్డి, మరో కాంట్రాక్టర్ ఎస్‌ఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీంతో అర్ధరాత్రి టెండర్లు విప్పిన 9 పనులను రద్దు చేసి, రీటెండర్‌కు ఇంజనీరింగ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుండి ఒకరిపై మరొకరు ద్వేషంతో రగిలి పోతున్నారు. ఈ క్రమంలో ఎస్టీ హాస్టల్‌లో మళ్లీ సమావేశం నిర్వహించారు. ఆందోళనకు కారణాలు అందరి ముందు వెల్లడించకుండా ఆరుగురు సభ్యులతో పాటు అన్ని పార్టీల అధ్యక్షులు, తుడుందెబ్బ నుండి ఒకరికి ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు అన్నారు. దీనికి మరికొందరు విభేదించారు. ఇలా శ్రీనివాస్‌రెడ్డి, నాగమల్లేశ్వర్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగి, పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో గుండంపల్లికి చెందిన గుళ్లెపల్లి శ్రీనివాస్ చేతికి గాయూలయ్యూరుు. శ్రీనివాసరెడ్డి తలకు దెబ్బ తగలడంతో ముక్కులో నుంచి రక్తం కారింది. అనంతరం ఇరువర్గాల వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
పాత కక్షలే కారణమా..?
దాడులకు పాల్పడ్డ రెండు వర్గాలు అధికార పార్టీ వారే కావడంతో పాత కక్షలే కారణమనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుండి జెడ్పీటీసీగా గెలుపొదిన దేశిడి అరుణ, ఆమె భర్త శ్రీనివాసరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు వస్తే నాగమల్లేశ్వర్ వర్గం అడ్డుపడిందనే విమర్శలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇద్దరు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గురువారం జరిగిన గొడవలకూ ఇదే కారణమై ఉంటుందని స్థానికులు అంటున్నారు.