చెరువులు, కుంటల ద్వారా 20 లక్షల ఎకరాలకు నీరు!
మైనర్ ఇరిగేషన్‌పై మంత్రి హరీష్‌రావు సమీక్ష
హైదరాబాద్: చెరువులు, కుంటల ద్వారా వచ్చే ఏడాది కల్లా 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. గొలుసుకట్టు చెరువులను పునరుద్దరిస్తామని చెప్పారు. చిన్న తరహా నీటి వనరులపై మంత్రి సోమవారం ఎర్రమంజిల్‌లోని జలసౌధలో అధికారుల సమీక్ష సమావేశంలో నీటి పారుదల శాఖ ప్రభత్వ సలహాదారు విద్యాసాగర్ రావు, ముఖ్య కార్యదర్శి అరవిందరెడ్డి, ఈఎన్‌సీలు నారాయణరెడ్డి, మురళీధర్, ఇంజనీర్లు పాల్గొన్నారు. రాష్ర్టంలో ఉన్న 36 వేల చెరువుల ద్వారా వచ్చే ఏడాదిలో 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.