ఆంధ్రాపాలనలో చెరువులకు ఆలనా కరువు
నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాకతీయులు, రెడ్డిరాజులు గొప్ప వారసత్వ సంపదగా చెరువులను మనకిచ్చారు.. ఆం ధ్రా పాలకుల చేతిలో పూడిక తీయకపోవటంతో గంగాళంలా ఉండాల్సిన ఈ చెరువులు తాంబాలంగా మారా యి. తెలంగాణపై పూర్తి వివక్ష చూపా రు. ఈ చెరువులకు పూర్వ వైభవం తేవాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం’.. అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు లింగగూడెం చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ చెరువు పనుల కోసం కందుకూరు గ్రామానికి చెందిన హెటిరోడ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి రూ.3.04 కోట్లు విరాళంగా ఇచ్చారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని రానున్న పది, పదిహేనురోజుల్లో పనులను పూర్తి చేయించాలన్నారు. కరువు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని గోదావరిజలాల తో సస్యశ్యామలం చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని అన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వద్ద ప్రణాళిక సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. హెటిరో పార్ధసారధిరెడ్డిని మంత్రి అభినందించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి జలాలతో దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. కార్యక్రమంలో హెటిరోడ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి పాల్గొన్నారు.
కందుకూరు మీద మమకారంతోనే: పార్థసారథిరెడ్డి
రైతుబిడ్డగా లింగగూడెం చెరువు ఆయకట్టు రైతుల ఆవేదన చూసి చలించానని.. కందుకూరు మీద ఉన్న మమకారంతో లింగగూడెం చెరువు పనుల పునరుద్ధరణకు రూ.3.04 కోట్లు విరాళంగా ఇచ్చానని హెటిరోడ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల కష్టాలను చూసి మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకోవటం అభినందనీయమన్నారు. తొలుత లింగగూడెం చెరువు అభివృద్ధికి రూ.2.50 కోట్లు ఇచ్చిన హెటిరోడ్రగ్స్ అధినేత చెరువు అం చనా వ్యయం మరో రూ.50.4 లక్షలు పెరగటంతో మంత్రి హరీశ్‌రావుకు వేదికపైనే చెక్కును అందించారు.
పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో సమీక్షించారు. సమావేశానికి పాలమూరు జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డితోపాటు ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరు లు హాజరయ్యారు. ప్రాజెక్టుల కింద ఖరీఫ్‌లో నిర్ణయించిన మేర ఆయకట్టుకు నీరివ్వాలని, ప్రాజెక్టుల కింద భూసేకరణ, పునరావాసం ప్రక్రియలను వేగిరం చేసే చర్యలకు పూనుకోవాలని సూ చిం చారు. ప్రాజెక్టుల ఈఈ, డీఈ లు కలెక్టర్లతో ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ భూ సేకరణ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.