ఖమ్మం / చింతకాని: ఎన్నికల ప్రచారంలో చెప్పింది..గెలిచాక చేసి చూపేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం తిమ్మినేనిపాలెం, తిరుమలాపురం, మత్కేపల్లి, జగన్నాథపురం గ్రామాల్లో ప్రచారం చేసి..మధిర టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి..ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే సాధ్యమవుతుందని చెప్పారు.
ఖమ్మంజిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా అనేక పనులు చేపట్టినట్లు తెలిపారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి..ఈ ఎన్నికల్లో ఆదరించాలని విన్నవించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేని స్థానిక ఎమ్మెల్యేను నిలదీయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారిలో ఒకడిగా మెదిలే లింగాల కమల్‌రాజ్‌ను గెలిపించాలని కోరారు. మత్కేపల్లి, తిమ్మినేనిపాలెం గ్రామాల్లో పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎంపీ పొంగులేటి సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరారు. ఈ సందర్భంగా ఎంపీ వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. కమల్‌రాజ్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అభ్యర్థించారు.
ఈ ప్రచారంలో మధిర టీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ మధిర ఇన్‌చార్జ్ బొమ్మెర రామ్మూర్తి, ఎంపీపీ దాసరి సామ్రాజ్యం, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, కార్యదర్శి కన్నెబోయిన కుటుంబరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కిలారు మనోహర్, జిల్లా సభ్యులు మంకెన రమేష్, మండల నాయకులు షేక్ మదార్‌సాహెబ్, కోపూరి పూర్ణయ్య, తిరుపతి కొండలరావు, వలమల నాగేశ్వరరావు, తెల్లగొర్ల కృష్ణ, కోలేటి సూర్యప్రకాశ్‌రావు, నూతలపాటి వెంకటేశ్వరరావు, పొనకాల రాంబాబు, వంకాయలపాటి సత్యనారాయణ, కన్నెబోయిన సీతారామయ్య, నెల్లూరి రమేష్, తూమాటి అనంతరెడ్డి, షేక్ షిలార్‌సాహెబ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment