క్షమాపణ చెప్పే రోజులొచ్చాయి
కేసీఆర్‌కు పొన్నాల హెచ్చరిక రైతులు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావ్ ఇంతకంటే పాపం ఏముంది?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాల నకు అప్పుడే రోజులు దగ్గరపడ్డాయని, రాష్ట్ర ప్ర జలంతా ఆయనపై భౌతికంగా తిరగబడే సమ యం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రుణమాఫీ అమలుకాక, కొత్త గా అప్పులు పుట్టక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ దక్కక, కౌన్సెలింగ్ జాప్యం కారణంగా సీట్లు కోల్పోయిన వేలాది మంది విద్యార్థుల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందని అన్నారు. తక్షణమే కేసీఆర్ ఆయా వర్గాలకు క్షమాపణ చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఆయున మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శల పరంపరను కొనసాగించారు.
వందరోజుల పాలనలో ఏ ఒక్క పని చేయని కేసీఆర్... చాలా మందికి చాలా డబ్బులివ్వడమే ప్రాధాన్యతగా పెట్టుకున్నారే తప్ప తెలంగాణ కోసం ప్రాణం ధారపోసినఅమరవీరుల కుటుం బాలను ఆదుకోవడం విస్మరించారు.కాంగ్రెస్ హయాంలో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గితే కేసీఆర్ వంద రోజుల పాలనలోనే 174 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో మెదక్ జిల్లాలోనే ఎక్కువ ఆత్మహత్యలున్నాయి. రుణాలందక, పంట నష్టపోయిన రైతులను కేసీఆర్ ఆదుకోక పోవడం శోచనీయం.
నిండు బహిరంగ సభలో దళిత ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హెచ్చరించిన కేసీఆర్‌కు అదే సూత్రం ఎందుకు వర్తించదు? రాష్ట్ర ప్రజలకు ఇబ్బడి ము బ్బడిగా హామీలిస్తూ ఏ ఒక్కటీ అమలు చేయకపోగా, వంద రోజుల పాలనలో అసలు ఏ ఒక్క పని చేయలేదని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా?
తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఎన్ని శక్తులు ఎదురైనా లెక్కచేయకుండా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీని బతుకమ్మ ఉత్సవాలకు ఆహ్వానించకుండా బిల్లును అడ్డుకున్న మహిళా నేతలకు ఆహ్వానం పంపడం తెలంగాణ సమాజాన్ని అవమానించడం కాదా?
ఉద్యోగులకు ఆప్షన్లు, గీప్షన్లు జాంతానై...అధికారంలోకి వస్తే చట్టాన్నే మారుస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌కు ఇప్పుడు అవే ఆప్షన్లు కొనసాగుతుంటే నోరెందుకు పెగలడం లేదు?
సరిగా పనిచేయని సర్పంచులను తొలగిస్తానంటున్న కేసీఆర్‌కు ఆ హక్కు ఎవరిచ్చారు? ఆకాశమే హద్దుగా హామీలివ్వడమే తప్ప ఏ ఒక్క పని చేయని నీకు ఆ సూత్రం వర్తించదా?
కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులంతా ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న నియంతల్లా వ్యవహరిస్తున్నారు. ఒకరేమో ‘తలతీస్తా, పాతరేస్తా’ అంటే ఇంకొకరేమో ‘తోలు తీస్తా’, మరొకరేమో ‘మీ అంతు చూస్తా’ అని భయపెడుతున్నారు. ప్రజాస్వామ్యయుతమైన పాలన అంటే ఇదేనా? కేసీఆర్ నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతోంది.